న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు బుధవారం జూలై 15కి వాయిదా వేసింది.
ఈ కేసులో కేజ్రీవాల్ ప్రతిస్పందనకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు అభ్యర్థించారు. దీంతో హైకోర్టు ఈ కేసును జూలై 15కి వాయిదా వేసింది.
కాగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 38 మంది నిందితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్‌లో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది. 232 పేజీల ఛార్జ్ షీట్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ కేసులో కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్‌గా, కుట్రదారుడిగా ఈడీ అభివర్ణించింది. లిక్కర్ స్కాంలో పొందిన డబ్బును గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని ఆరోపించింది. కేజ్రీవాల్, వినోద్ చౌహన్‌తో వాట్సాప్ చాట్‌లను ఈడీ చార్జిషీట్‌లో ప్రస్తావించింది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కవిత పేరును కూడా ప్రస్తావించింది. కవిత మాజీ పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రూ. 25 కోట్ల లావాదేవిలు జరిగినట్లు ఈడీ తెలిపింది. కవిత దగ్గర నుంచి రెండు బైకుల్లో నగదు తీసుకెళ్ళి దినేష్ అరోరాకు అప్పగించారు. ఢిల్లీలోని వినోద్ చౌహన్ దగ్గర అశోక్, దినేష్ అరారోలు కలుసుకున్నారు. గోవా ఎన్నికల సందర్భంగా వినోద్ చౌహన్ డబ్బుల పంపిణీ చేశాడు. ముత్త గౌతమ్ సంబంధించిన మీడియా సంస్థ ద్వారా హవాలా లావాదేవీలు జరిగాయి.
అభిషేక్ బోయినపల్లి, ముత్తా గౌతమ్‌తో కలిసి ఏడు కోట్ల రూపాయలను అవార్ల ద్వారా అరవింద్ సింగ్ ఇచ్చారు. 45 కోట్ల రూపాయలను గోవాకు హవాలా ద్వారా సాగర్ పార్టీలకు చేరవేశారు. ముత్త గౌతమ్‌కు సంబంధించిన చారియట్ మీడియా ద్వారా మీడియా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగాయి. చారియట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు తోపాటు చాలామందికి లింకులు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
మరోవైపు కేజ్రీవాల్, ఆప్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం విచారణకు తీసుకుంది. కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.
కాగా మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, జూన్ 26న అవినీతి కేసులో ఆప్ అధినేతను సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ అరెస్టు, రిమాండ్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో గత వారం ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించేందుకు దర్యాప్తు సంస్థకు కోర్టు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 17కు వాయిదా వేసింది..
Comments
Please login to add a commentAdd a comment