
అవినీతిపై దర్యాప్తుకు బలమైన వ్యవస్థ: కేజ్రీవాల్
10-15 రోజుల్లోగా రామ్‌లీలా మైదానంలో ‘లోక్‌పాల్’ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖల్లోని అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కోసం బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. అవినీతిని పెకలిం చేందుకు త్వరలోనే జనలోక్‌పాల్ బిల్లును తేనున్న ట్లు తెలిపారు. సోమవారం విజిలెన్స్ అధికారులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారుల అవినీతి, ఇతర అవకతవకలపై ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా ఈనెల 9నాటికి హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 10-15 రోజుల్లో రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేయనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ఆమోదిస్తామన్నారు.