
న్యూఢిల్లీ: వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. దేశంలో రెండు కంపెనీలు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని. ఇదే తరహాలో అయితే, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లు పడుతుందని అన్నారు. రెండు కంపెనీలతో దేశమంతా వ్యాక్సిన్ ఇవ్వడం అసంభవమని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తయారుచేసే ఇతర కంపెనీలకు ఫార్ములాను అందజేయాలని కోరారు. అప్పుడే భారతీయులందరికీ వ్యాక్సిన్లు లభిస్తాయని అన్నారు.
వ్యాక్సిన్ తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌అన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నేషనల్ ప్లాన్ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. కేవలం రెండు కంపెనీలపైనే వ్యాక్సిన్ తయారీకి ఆధారపడకుండా, ఈ రెండు కంపెనీల నుంచి కేంద్రం ఫార్ములా సేకరించి అన్ని కంపెనీలకూ వ్యాక్సిన్ తయారుచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఒరిజినల్ వ్యాక్సిన్ తయారీదారులకు రాయల్టీగా చెల్లించాలన్నారు.
చదవండి:
సెకండ్ వేవ్ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి..
ఇండియన్ కోవిడ్ స్ట్రెయిన్ ఆందోళనకరం: డబ్ల్యూహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment