సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ పోస్టర్ వార్‌కు తెరలేపింది. కేజ్రీవాల్ దేశ ద్రోహులకు మద్దతిస్తారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పలుచోట్ల బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధ్వర్యంలో పోస్టర్లు వెలిశాయి. దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారిని కేజ్రీవాల్ కాపాడతారంటూ రాసిఉన్న పోస్టర్లను నగరంలోని మండీ హౌస్, కన్నాట్ ప్లేస్, అశోకా రోడ్, ఐటీఓ సహా పలు కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు నిరూపితం కాలేదని ఢిల్లీ ప్రభుత్వం హోం శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఈ పోస్టర్లు ఏర్పాటుకావడం గమనార్హం. ఆప్ రెబెల్ నేతగా పేరొందిన కపిల్ మిశ్రా ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మిశ్రా బీజేపీ తరపున ప్రచారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment