
ప్రధాని మోదీపై సీఎం ఫైర్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్పై ఫైర్ అయ్యారు. ఢిల్లీలో పూర్తిగా జంగిల్ రాజ్ నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. శాంతిభద్రతలను రక్షించడంలో మోదీ, జంగ్ విఫలమయ్యారని నిందించారు.
ఢిల్లీలో బ్రహ్మపుర ప్రాంతంలో తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెలు హత్యకు గురికావడం.. మరో ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం వంటి దారుణాలు వెలుగుచూశాక కేజ్రీవాల్.. శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, జంగ్లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు.