ఫకీర్ అంటారు.. 10 లక్షల సూట్ వేస్తారు
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ తనకు తాను ఫకీర్ అని చెప్పుకుంటారని, అయితే 10 లక్షల రూపాయల విలువైన సూట్ ధరిస్తారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మొరదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. నల్లధనంపై పోరాటం చేస్తునందుకు తనను టార్గెట్ చేశారని, తానో ఫకీర్‌నని, ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఫకీర్ ఖరీదైన సూట్ వేసుకుంటారా అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ వ్యవస్థలను అంతం చేస్తున్నారని, దేశం 65 ఏళ్లలో సాధించిన దాన్ని.. మోదీ ఐదేళ్ల పాలనలో నాశనం చేస్తారని కేజ్రీవాల్ విమర్శించారు.