మోదీ ఫ్రెండ్ నీతాకు భద్రత కల్పించారు కానీ.. | PM providing security to 'friend' Nita, nothing for women in Delhi: CM | Sakshi
Sakshi News home page

మోదీ ఫ్రెండ్ నీతాకు భద్రత కల్పించారు కానీ..

Published Tue, Jul 26 2016 6:09 PM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM

మోదీ ఫ్రెండ్ నీతాకు భద్రత కల్పించారు కానీ.. - Sakshi

మోదీ ఫ్రెండ్ నీతాకు భద్రత కల్పించారు కానీ..

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ..  నీతా అంబానీ వంటి స్నేహితులకు భద్రత కల్పిస్తారు కానీ, ఢిల్లీ మహిళల భద్రతను విస్మరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి వై కేటగిరి భద్రత కల్పించనున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. 'ఢిల్లీలో నిత్యం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాలని ఎన్నిసార్లు కేంద్రానికి విన్నవించినా పట్టించుకోలేదు. అయితే ప్రధాని తన స్నేహితులకు భద్రత ఏర్పాటు చేశారు' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. నీతాకు వీవీఐపీ భద్రత అంటూ పేపర్లో వచ్చిన వార్త క్లిప్పింగ్ ఇమేజ్ను కూడా పోస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement