మోదీజీ దమ్ముంటే సోనియాను జైలులో పెట్టండి | Gandhis Have Some 'Secrets' Of PM Modi: Arvind Kejriwal | Sakshi

మోదీజీ దమ్ముంటే సోనియాను జైలులో పెట్టండి

Published Sun, May 8 2016 1:24 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మోదీజీ దమ్ముంటే సోనియాను జైలులో పెట్టండి - Sakshi

మోదీజీ దమ్ముంటే సోనియాను జైలులో పెట్టండి

మోదీకి దమ్ముంటే సోనియాగాంధీని వెంటనే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సోనియా గాంధీలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మోదీకి చెందిన రహస్యాలు గాంధీ కుటుంబం దగ్గర ఉన్నాయని అందుకే సోనియాగాంధీపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు.
 
మోదీకి దమ్ముంటే సోనియాగాంధీని వెంటనే అరెస్టు చేయించాలని సవాల్ విసిరారు. యూపీఏ ప్రభుత్వంలో సోనియాగాంధీకి ముడుపులు ముట్టిన వ్యవహారంలో నరేంద్రమోదీకి సైతం సంబంధం ఉన్నట్టు ఆయన ఆరోపించారు.  వీవీఐపీల విమానం కొనుగోలులో ముడుపులు అందాయని ఇటలీ కోర్టు వ్యాఖ్యానించినా చర్యలు తీసుకోకపోవడంలోని ఆంతర్యం ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement