తగ్గని మోదీ హవా | Modi remains popular leader in india | Sakshi
Sakshi News home page

తగ్గని మోదీ హవా

Published Thu, Nov 16 2017 4:43 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Modi remains popular leader in india - Sakshi

2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మ్యాజిక్‌ చేస్తారా? భారతీయ జనతా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారా? పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి ప్రజలు ఆమోదముద్ర వేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోదీకి చరిష్మా దేశంలో ఏ మాత్రం తగ్గలేదని తాజా సర్వే సష్టం చేసింది. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సంస్థ దేశంలో మోదీ హవాపై తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 2,464 మంది పాల్గొన్నారు. ఈ సర్వేలో ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలు మోదీని విశ్వసిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేలో 88 శాతం ఓట్లతో మోదీ ఏ నేతకు అందనంత ఎత్తులో నిలిచారు. తరువాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 49 పాయింట్లు, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ 31 పాయింట్లు, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 30 పాయింట్లతో తరువాత స్థానాల్లో ఉన్నారు.

ప్యూ సంస్థ ఈ సర్వేను పిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య నిర్వహించింది. మోదీ నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా మారుతుందన్న విశ్వాసమే మోదీ హవాకు కారణమని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే గాడిలో పడిందని చెప్పడం గమనార్హం. దేశ పరిస్థితులపై ప్రతి పదిమందిలో ఏడుగురు సంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు.

దేశమంతా మోదీహవా
ప్రధాని నరేంద్ర మోదీపై దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌లలో సానుకూల దృక్ఫథం ఉందని సర్వే ప్రకటించింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్‌, జార్ఖండ్‌,  ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్తాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో మోదీకి హవా ఏ మాత్రం తగ్గలేదు.

ప్రభుత్వంపై నమ్మకం
దేశంలోని మొత్తం 85 శాతం మంది ప్రజలకు ఈ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసముందని సర్వే ప్రకటించింది. దేశంలో ప్రజాస్వామ్య పనితీరుపై 79 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా 55 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ మద్దతు తెలపడం గమనార్హం.  

ప్రభావం చూపని పెద్దనోట్ల రద్దు
గత ఏడాది నవంబర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న డిమానిటైజేషన్‌ నిర్ణయం ఏ మాత్రం వ్యతిరేక ప్రభావం చూపలేదు. అప్పట్లో 45 శాతం మంది ప్రజలు కరెన్సీ కోసం ​తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అయినా ప్రజలు మోదీకి మద్దతు తెలిపారని సర్వే స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement