Pew Research Center survey
-
నిరుద్యోగం, ఉగ్రవాదమే అసలు సవాళ్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముంగిట దేశ ప్రజలు నిరుద్యోగం, ఉగ్రవాదంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. దేశం ముందుకు సాగుతున్న తీరుపై చాలా మంది ఆశావహ దృక్పథంతోనే ఉన్నట్లు తేలింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ అధ్యయనం చేపట్టింది. ఉగ్రవాదం, పాక్ నుంచి ముప్పుపై ఎక్కువ శాతం మంది భయాందోళనలు వ్యక్తం చేశారు. 20 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందని సుమారు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత కఠిన సవాలు నిరుద్యోగమే అని 76 శాతం మంది పేర్కొన్నారు. సర్వే ముఖ్యాంశాలు ► పాక్‌తో భారత్‌కు ముప్పు ఉందని 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో తాజా పరిస్థితి తీవ్రమైన సమస్య అని పేర్కొన్న వారు 55 శాతం మంది. ► కశ్మీర్లో పరిస్థితి దిగజారిందని అభిప్రాయపడిన 53 శాతం మంది. ► కొన్నేళ్లుగా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నా ధరలు పెరగడం సమస్యగా మారిందని 73 శాతం మంది చెప్పారు. ► అవినీతి అధికారులు(66 శాతం), ఉగ్రవాదం (63 శాతం), నేరాలు(64 శాతం) దేశానికి పెద్ద సమస్యలుగా మారాయని పేర్కొన్నారు. ► భారత్‌లో అభద్రతా భావంతో జీవిస్తున్నామని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► 2014 నుంచి మత విద్వేష ఘటనలు పెరిగినా, కేవలం 34 శాతం మందే ఇది పెద్ద సమస్య అని పేర్కొన్నారు. ► ఎన్డీయే హయాంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని 21 శాతం మంది పేర్కొనగా, పరిస్థితి దిగజారిందని 67 శాతం మంది చెప్పారు. ► ధరలు భారీగా పెరిగాయని 65 శాతం మంది, అవినీతి పెచ్చరిల్లుతోందని 65 శాతం మంది, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని 59 శాతం మంది అన్నారు. ► ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవినీతిపరులని 69 శాతం పేర్కొనగా, ఎవరు గెలిచినా ఈ పరిస్థితిలో మార్పు రాదని 58 శాతం మంది పౌరులు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు, ఆరోగ్యానికే ప్రాధాన్యం తర్వాతి స్థానాల్లో తాగునీరు, రోడ్లు ప్రాధాన్యతాంశాలపై ఏడీఆర్ సర్వే న్యూఢిల్లీ: మెరుగైన ఉద్యోగావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, సురక్షిత తాగునీరుకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సర్వేలో తేలింది. ఓటరు ప్రాధాన్యతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు సగటు కన్నా దిగువనే ఉందని తెలిసింది. ఓటరు ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాలు, ఓటరు ప్రాధాన్యతా అంశాలు(10), ప్రభుత్వ పనితీరుకు ప్రజలిచ్చిన రేటింగ్ ప్రాతిపదికగా ఈ సర్వే నిర్వహించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉండాలని 46.80 శాతం మంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని 34.60 శాతం మంది, సురక్షిత తాగునీరు కావాలని 28.34 శాతం మంది అభిప్రాయపడ్డారు. తరువాతి స్థానాల్లో మెరుగైన రోడ్లు(28.34 శాతం), లోపరహిత ప్రజా రవాణా వ్యవస్థ(27.35 శాతం) ఉన్నాయి. ఓటర్ల టాప్ 10 ప్రాధాన్యతా అంశాల్లో వ్యవసాయ సంబంధ విషయాలు కూడా ఉన్నాయి. సాగునీరు(26.40 శాతం) ఆరో స్థానంలో, రుణ పరపతి(25.62 శాతం) ఏడో స్థానంలో, పంట ఉత్పత్తులకు మద్దతు ధర(25.41 శాతం) 8వ స్థానంలో, సబ్సిడీలు(25.06 శాతం) 9వ స్థానంలో ఉన్నాయి. మెరుగైన శాంతి భద్రతలకు 10వ స్థానం దక్కింది. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
పాకిస్తాన్ శత్రు దేశమే!?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ విభజన జరిగిన నాటినుంచీ భారత్-పాకిస్తాన్‌లు.. ఆగర్భ శత్రవులుగానే ప్రపంచం ముందు గుర్తింపు తెచ్చుకున్నాయి. దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, 1947 నుంచి 1980 వరకూ ఉన్న ప్రపంచ రాజకీయ కారణాలు.. ఇలా అన్నీ ఈ రెండింటిమధ్య ఆరని చిచ్చును రగిల్చాయి. అదే సమయంలో కశ్మీర్ దురాక్రమణ, కార్గిల్, అంతకుముందు జరిగిన రెండు యుద్ధాలు కూడా భారత్-పాకిస్తాన్ల మధ్య శత్రుత్వాన్ని అమాంతం పెంచాయి. దేశ విభజన నాటి నుంచి ఇరు దేశాల మధ్య కశ్మీర్ కార్చిచ్చును రగిలిస్తోంది. అదే సమయంలో కశ్మీర్లో ఉగ్రవాదు చొరబాట్లతో పాటు, వేర్పాటువాదులను ప్రోత్సహించడం వంటివి పాకిస్తాన్ దశాబ్దాల తరబడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారతీయుల అభిప్రాయం గురించి అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సర్వే ముఖ్యాంశాలు భారతీయుల్లో ఏటికేడు పాకిస్తాన్‌ను అసహ్యించుకునే వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా 2013 నుంచి పాక్‌ను ద్వేషించే వారి శాతం మరింత ఎక్కువగా ఉంది. దేశంలో దాదాపు 72 శాతం మంది ప్రజలకు పాకిస్తాన్‌పై సదభిప్రాయం లేదు. దాదా 64 శాతం మంది ప్రజలైతే.. పాక్‌ను శత్రుదేశంగానే భావిస్తుండడం విశేషం. కాంగ్రెస్, బీజేపీని అనుకూల ఓటర్లు సైతం పాకిస్తాన్‌పై ఒకటే భావాన్ని వ్యక్తం చేయడం విశేషం. కశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు, వ్యూహాత్మక ఎత్తుగడలను మెజారిటీ ప్రజలు సమర్థిస్తుండడం విశేషం. పాకిస్తాన్‌పై బీజేపీ ప్రభుత్వం తీసకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు సర్వే తెలిపింది. -
కశ్మీర్‌పై ఆ పనికి దిగితే..!?
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ.. సంచలన విషయాన్ని బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ (ఏపీఎస్‌పీఏ)ను ఉపసంహరించాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే జమ్మూ కశ్మీర్లో మరింతగా సైనికులను రంగంలోకి దించాలని 60 శాతం మంది కోరుకుంటున్నట్లు ప్యూ సర్వే సంస్థ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు సమస్య, ఆక్రమిత కశ్మీర్ విషయంలో మెజారిటీ భారతీయులు సైనిక చర్య చేపట్టాలని కోరుకుంటున్నట్లు సర్వే ప్రకటించింది. ఇప్పడున్న సైన్యం కన్నా మరింత అధికంగా సైన్యాన్ని లోయలోకి దించాలని 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొంది. పాక్‌పై ఆగ్రహం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాకిస్తాన్‌పై దేశ ప్రజల్లో తీవ్రవ్యతిరేక భావనలు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఆరుమంది పాకిస్తాన్‌పై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని సర్వే పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే పాకిస్తాన్‌ను ద్వేషించేవారు 55 శాతం మేర పెరిగారు. కశ్మీర్ విషయంలో పార్టీలకతీతంగా మెజారిటీ ప్రజలు పాకిస్తాన్‌ను ద్వేషిస్తున్నట్లు సర్వే తెలిపింది. అమెరికాకు చెందిన ప్యూ సర్వే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో దేశంలోని పలు ప్రాంతాల్లో 2,464 మందిని సర్వే చేసింది. -
తగ్గని మోదీ హవా
2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మ్యాజిక్ చేస్తారా? భారతీయ జనతా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారా? పెద్దనోట్ల రద్దు, జీఎస్టీకి ప్రజలు ఆమోదముద్ర వేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోదీకి చరిష్మా దేశంలో ఏ మాత్రం తగ్గలేదని తాజా సర్వే సష్టం చేసింది. అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సంస్థ దేశంలో మోదీ హవాపై తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 2,464 మంది పాల్గొన్నారు. ఈ సర్వేలో ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలు మోదీని విశ్వసిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేలో 88 శాతం ఓట్లతో మోదీ ఏ నేతకు అందనంత ఎత్తులో నిలిచారు. తరువాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 49 పాయింట్లు, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ 31 పాయింట్లు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 30 పాయింట్లతో తరువాత స్థానాల్లో ఉన్నారు. ప్యూ సంస్థ ఈ సర్వేను పిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య నిర్వహించింది. మోదీ నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ తిరుగులేని శక్తిగా మారుతుందన్న విశ్వాసమే మోదీ హవాకు కారణమని సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే గాడిలో పడిందని చెప్పడం గమనార్హం. దేశ పరిస్థితులపై ప్రతి పదిమందిలో ఏడుగురు సంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. దేశమంతా మోదీహవా ప్రధాని నరేంద్ర మోదీపై దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లలో సానుకూల దృక్ఫథం ఉందని సర్వే ప్రకటించింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్లలో మోదీకి హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వంపై నమ్మకం దేశంలోని మొత్తం 85 శాతం మంది ప్రజలకు ఈ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసముందని సర్వే ప్రకటించింది. దేశంలో ప్రజాస్వామ్య పనితీరుపై 79 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంగా 55 శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ మద్దతు తెలపడం గమనార్హం. ప్రభావం చూపని పెద్దనోట్ల రద్దు గత ఏడాది నవంబర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయం ఏ మాత్రం వ్యతిరేక ప్రభావం చూపలేదు. అప్పట్లో 45 శాతం మంది ప్రజలు కరెన్సీ కోసం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అయినా ప్రజలు మోదీకి మద్దతు తెలిపారని సర్వే స్పష్టం చేసింది. PM Modi’s handling of various issues receive a thumbs uphttps://t.co/KgJOzkvgjP via NMApp pic.twitter.com/aQuawPp7e3 — Nirmala Sitharaman (@nsitharaman) November 16, 2017 Indians happy with the economic situation under PM Modihttps://t.co/KgJOzkvgjP via NMApp pic.twitter.com/S9Ub1ihti4 — Nirmala Sitharaman (@nsitharaman) November 16, 2017 Narendra Modi’s rises in popularity while others dip in the last 4 yearshttps://t.co/KgJOzkvgjP via NMApp pic.twitter.com/IPxrUvvvAf — Nirmala Sitharaman (@nsitharaman) November 16, 2017 -
మాకో హిట్లర్ కావాలి
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అస్థిర ప్రభుత్వాలు రాజ్యమేలినా.. ఏనాడూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని సైన్యం చేయలేదు. ప్రజాతీర్పే శిరోధార్యం.. మరి ఇలాంటి దేశంలో ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కారణమేదైనా కావొచ్చు.. భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16–మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్ సేకరించింది. దీని ప్రకారం.. సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు. ఏడు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ప్రజాస్వామ్యమని (ఎమర్జెన్సీ చీకటి రోజులను మినహాయిస్తే) చెప్పుకునే మనదేశంలో 55 శాతం మంది ఏదో ఒకరూపంలో నియంతృత్వాన్నే కోరుకుంటున్నారు. 27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు. అయితే 50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పడం విశేషం. 2012 నుంచి భారత్ సగటున 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఇది ముఖ్యకారణమని ప్యూ విశ్లేషించింది. శక్తిమంతమైన నాయకుడు కావాలి.. శక్తిమంతమైన నాయకుడి రూపంలో ఏకవ్యక్తి పాలన మేలని 27 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. బలమైన నాయకుడి పాలనను 48 శాతం మంది రష్యన్లు కోరుకుంటున్నారు. అయితే ఏకవ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమైన పాలన సాధారణంగా జనాదరణకు నోచుకోదని ప్యూ రీసెర్స్ వ్యాఖ్యానించింది. పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫలితాలు త్వరగా కనపడతాయని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు. జర్మనీలో 93 శాతం, స్వీడన్లో 90 శాతం, నెదర్లాండ్స్‌లో 89 శాతం మంది బలమైన ఏకవ్యక్తి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెక్నోక్రసీ(సాంకేతిక నిపుణులతో కూడిన బృందం) పాలనను బలపర్చిన మూడు దేశాల్లో భారత్ కూడా ఒకటి. వియత్నాంలో 67 శాతం, భారత్‌లో 65 శాతం, ఫిలిప్పీన్స్‌లో 62 శాతం మంది నిపుణుల ఆధ్వర్యంలో పాలన సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే రాజకీయ నాయకత్వం చేతిలోనే పాలన ఉండాలని 57 శాతం మంది ఆస్ట్రేలియన్లు పేర్కొన్నారు. సైనిక పాలనకు ‘జై’ ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా నిలుస్తున్నామని చెప్పుకొనే భారత్‌లో ఏకంగా 53 మంది సైనికపాలనను కోరుకోవడం విశేషం. రాజకీయ నాయకత్వంపై నమ్మకాన్ని కోల్పోవడం, అవినీతి పెచ్చరిల్లడం, ఇతర అవలక్షణాలు దీనికి కారణం కావొచ్చు. సైనికపాలనను కోరుకుంటున్న వారిలో మెజారిటీ 50 ఏళ్లలోపు వారే కావడం ఇక్కడ గమనార్హం. ఇది యువతలో ప్రస్తుత వ్యవస్థపై గూడుకట్టుకున్న అసహనాన్ని సూచిస్తోంది. దక్షిణాఫ్రికాలోనూ 52 శాతం మంది సైనికపాలనే మేలని భావిస్తున్నారు. అయితే యూరోప్‌లో మాత్రం కేవలం పది శాతం మందే సైనిక పాలనకు ఓటేశారు. సర్వే నిర్వహించిన 38 దేశాల్లో సగం కంటే ఎక్కువ దేశాల్లో ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే మేలని జనం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య అనుకూల వైఖరి ఉన్నా దేశాలను బట్టి ఇది మారింది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూనే.. ఇతర పాలన విధానాలకు కూడా తాము వ్యతిరేకం కాదనే భావనను ఆయా దేశాల ప్రజలు వ్యక్తపరిచారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నెట్‌తో సొంత నిర్ణయాలు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగించే పిల్లలు సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిర్ణయాలను సొంతంగా నెట్ నుంచి క్రమంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెట్ వాడకుండా నిషేధించడం కంటే వినియోగించేలా చేయడ మే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న ఉత్తమ నిర్ణయం అవుతుందని స్పష్టంచేశారు. యుక్తవయసులో ఉన్న 68 మందిపై రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారంప్రపంచ వ్యాప్తంగా 92 శాతం టీన్స్ నెట్ వాడుతున్నారు.