పాకిస్తాన్‌ శత్రు దేశమే!? | Over 70% Indians See Pakistan Unfavourably | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ శత్రు దేశమే!?

Published Fri, Dec 8 2017 2:17 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Over 70% Indians See Pakistan Unfavourably - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ విభజన జరిగిన నాటినుంచీ భారత్‌-పాకిస్తాన్‌లు.. ఆగర్భ శత్రవులుగానే ప్రపంచం ముందు గుర్తింపు తెచ్చుకున్నాయి. దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, 1947 నుంచి 1980 వరకూ ఉన్న ప్రపంచ రాజకీయ కారణాలు.. ఇలా అన్నీ ఈ రెండింటిమధ్య ఆరని చిచ్చును రగిల్చాయి. అదే సమయంలో కశ్మీర్‌ దురాక్రమణ, ​కార్గిల్‌, అంతకుముందు జరిగిన రెండు యుద్ధాలు కూడా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య శత్రుత్వాన్ని అమాంతం పెంచాయి.

దేశ విభజన నాటి నుంచి ఇరు దేశాల మధ్య కశ్మీర్‌ కార్చిచ్చును రగిలిస్తోంది. అదే సమయంలో కశ్మీర్‌లో ఉగ్రవాదు చొరబాట్లతో పాటు, వేర్పాటువాదులను ప్రోత్సహించడం వంటివి పాకిస్తాన్‌ దశాబ్దాల తరబడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారతీయుల అభిప్రాయం గురించి అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

సర్వే ముఖ్యాంశాలు

  • భారతీయుల్లో ఏటికేడు పాకిస్తాన్‌ను అసహ్యించుకునే వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా 2013 నుంచి పాక్‌ను ద్వేషించే వారి శాతం మరింత ఎక్కువగా ఉంది.
  • దేశంలో దాదాపు 72 శాతం మంది ప్రజలకు పాకిస్తాన్‌పై సదభిప్రాయం లేదు.
  • దాదా 64 శాతం మంది ప్రజలైతే..  పాక్‌ను శత్రుదేశంగానే భావిస్తుండడం విశేషం.
  • కాంగ్రెస్‌, బీజేపీని అనుకూల ఓటర్లు సైతం పాకిస్తాన్‌పై ఒకటే భావాన్ని వ్యక్తం చేయడం విశేషం.
  • కశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు, వ్యూహాత్మక ఎత్తుగడలను మెజారిటీ ప్రజలు సమర్థిస్తుండడం విశేషం.
  • పాకిస్తాన్‌పై బీజేపీ ప్రభుత్వం తీసకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు సర్వే తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement