న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను మట్టికరిపించి అనూహ్యమైన విజయాన్ని సాధించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. మరో ఆరుగురు మంత్రులుగా తమ పదవులను స్వీకరించారు. అయితే కేజ్రీవాల్ మంత్రివర్గంలోమహిళలకుచోటు దక్కక కపోవడంపై అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు, ట్వీట్లు మొదలయ్యాయి.
మంచి పాలన అందిస్తామంటూ, మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి... ఒక్క మహిళకు కూడా స్థానం ఎందుకు కల్పించలేదని నటి హుమా ఖరేషి తన ట్విట్టర్ లో ప్రశ్నించారు. కేజ్రీవాల్ కేబినెట్ లో మహిళలకు స్థానం లేకపోవండం బాధకలిగించిందని ప్రముఖ ఫోటో గ్రాఫర్ అతుల్ కాస్బేకర్ కమెంట్ పోస్ట్ చేశారు. ఎంతమంది మహిళలున్నారు కేజ్రీవాల్ కేబినెట్ లో అంటూ హెయిర్ స్టయిలిస్ట్ సాప్నా భవాని ట్వీట్ చేశారు.