
బాలుడిని అప్పగిస్తున్న అయ్యప్ప భక్తులు
పాలకొండ: పాలకొండలో నాలుగేళ్ల బాలుడు తల్లి దండ్రుల నుంచి తప్పిపోయి వాట్సాప్ సాయంతో చివరకు తల్లి చెంతకు చేరాడు. బధిరుడైన ఈ బా లుడిని తల్లి చెంతకు చేర్చడానికి దాదాపు పాలకొం డ పట్టణమంతా సోమవారం వెతుకులాట సాగిం చడం విశేషం. మండలంలోని గోపాపురం గ్రామానికి చెందిన వారాడ వెంకటరమణ, సుమలతలు తమ నాలుగేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌తో సోమవా రం ఉదయం 10 గంటలకు ఆంధ్రాబ్యాంకుకు వ చ్చారు. పనుల్లో మునిగిపోయి గంట తర్వాత చూస్తే బాలుడు కనిపించలేదు. బ్యాంకు సీసీ కెమెరాల్లోనూ బాలుడి ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనతో అందరికీ విషయం చెప్పారు. అక్కడున్న పాత్రికేయులతో సహా బ్యాంకుకు వచ్చిన వా రు తమ వాట్సాప్ గ్రూపుల్లో ఈ సమాచారాన్ని పం చుకున్నారు. స్థానిక యువకులు కూడా బైకులు తీసుకుని బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు.
వెతుకులాట జరుగుతుండగా స్థానిక ఆంధ్రా బ్యాం కు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో అయ్యప్ప మాలధారులు చెరువు వద్ద బాలుడిని గమనించారు. బాలుడు మాట్లాడలేకపోవడంతో అతడికి భిక్షను భోజనంగా పెట్టి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిం చారు. కొంత మంది స్వాముల సెల్‌ఫోన్‌లో బాలు డు తప్పిపోయినట్లు సమాచారం రావడంతో తల్లి దండ్రులను సంప్రదించి తమ వద్దే ఉన్న విషయం తెలిపారు. వెంటనే వారు ఆలయానికి వెళ్లడంతో పి. మునిస్వామి, ఎల్.శంకరస్వాములు బాలుడిని అప్పగించారు. కొడుకును చూసి తల్లి సుమలత ఏడుపు ఆపుకోలేకపోయారు. బాలుడిని అప్పగించినందుకు స్వాములకు, వెతికినందుకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment