
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని వీరవాసరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన కొణితివాడకు చెందిన ఏడేళ్ల బాలుడు శవమై కనిపించాడు. వివరాలు.. నిన్న సాయంత్రం నుంచి మోక్ష గౌతమ్(7) కనిపించకుండాపోయాడు. ఊరులోని చెరువులో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున బాలుని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment