
సాక్షి, రాయపర్తి(పాలకుర్తి): వివాహ వేడుకల్లో ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కృష్టాపురం క్రాస్‌లోని వీఆర్‌గార్డెన్‌లో ఆదివారం జరిగింది. స్థానిక ఎస్సై లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం... వరంగల్ పట్టణ శివారులోని రంగశాయిపేటకు చెందిన కాటుకొజ్యల వెంకటరమణాచారి తన కుటుంబ సభ్యులతో రాయపర్తి మండలానికి చెందిన బంధువుల వివాహానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో అతడి కుమారుడు కాటుకొజ్యల రిషికేష్(2) తప్పిపోయాడు. బాలుడి తండ్రి వెంకటరమణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.