డ్యాన్సింగ్‌ పోలీస్‌ విత్‌... | Mumbai cop dances with Danish woman on street, impresses internet | Sakshi
Sakshi News home page

డ్యాన్సింగ్‌ పోలీస్‌ విత్‌...

Nov 3 2024 4:56 AM | Updated on Nov 3 2024 4:56 AM

Mumbai cop dances with Danish woman on street, impresses internet

సమ్‌థింగ్‌ స్పెషల్‌

ముంబైకి సంబంధించినంత వరకు ‘డ్యాన్సింగ్‌ పోలీస్‌’ అంటే గుర్తుకు వచ్చే పేరు అమోల్‌ కాంబ్లే. పోలీస్‌ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న అమోల్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయ్యాయి. తాజాగా అమోల్‌ కాంబ్లే డ్యాన్స్‌కు టిక్‌టాక్‌ సెన్సేషన్‌ ఇసాబెల్‌ ఆఫ్రో డాన్స్‌ తోడైంది. కాదు... కాదు... ఆమె డ్యాన్స్‌కే అమోల్‌ డ్యాన్స్‌ తోడైంది. 

రద్దీగా ఉండే ముంబై వీధి మధ్యలో ఆఫ్రో డ్యాన్స్‌ మొదలుపెట్టగానే... చుట్టుపక్కల ఉన్న ఆటోడ్రైవర్‌లు, ఇతరులు గుమిగూడి ఆ డాన్స్‌ను తమ ఫోన్‌లలో షూట్‌ చేయడం మొదలుపెట్టారు.

ఇంతలో బిగ్‌ సర్‌ప్రైజ్‌.
ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో తెలియదుగానీ ‘డాన్సింగ్స్‌ పోలీస్‌’ అమోల్‌ ఆఫ్రోతో కలిసి స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ చేస్తూ కనిపించే అమోల్‌ ఈసారి మాత్రం కేవలం టోపీతో మాత్రమే కనిపించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫ్రో షేర్‌ చేసిన ఈ వీడియోను 3.4 మిలియన్‌ల మంది వీక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement