చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్‌లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.
గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్‌లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు.
Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee
— Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021
ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్‌గా..
Comments
Please login to add a commentAdd a comment