Baby deer
-
అమ్మా భయమేస్తోంది.. నువ్వేక్కడున్నావ్
అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మా.. నీవే లేక వసివాడనమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే... అంటూ తల్లడిల్లిపోతోంది శామీర్‌పేట డీర్–పార్క్‌లోని పసి దుప్పి. శామీర్‌పేట్: ముద్దులొలికే ఈ చిన్నారి జంకకు సీత కష్టాలు వచ్చాయి. తల్లి తన వద్దకు ఎప్పుడు వస్తుందోనని వేయి కళ్లతో.. కోటి ఆశలతో వేచి చూస్తోంది. చిన్నచిన్నగా గెంతుతూ ఎంతో అందంగా ఉన్న ఆ దుప్పి తల్లి కనిపించక విలవిలలాడిపోతోంది. శామీర్‌పేట డీర్ పార్కులో నెలన్నర క్రితం పార్కు ఫెన్సింగ్‌లో తల ఇరుక్కుని ఉన్న సుమారు రెండు రోజుల వయస్సు ఉన్న జింకపిల్లను సిబ్బంది గమనించారు. దానికి చికిత్స చేసి అప్పటి నుంచి ఆవు పాలు తాగిపిస్తూ పెంచుతున్నారు. మరి అప్పటి నుంచి తల్లి జింకను ఎందుకు పట్టుకోలేకపోయారు.? ఎక్కడ ఉంది అనే దానిపై విచారణ చేపట్టారా? తల్లీబిడ్డను ఇప్పటి వరకు ఎందుకు కలుపలేకపోయారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అటవీశాఖ అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూద్దాం. తరలించిన జింకలలో ఉందా.? ఫిబ్రవరి చివరి వారంలో శామీర్‌పేట డీర్‌పార్కు నుంచి కాగజ్‌నగర్‌కు 27 జింకలను తరలించామని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ దుప్పి జన్మించింది. ఈ దుప్పి తల్లి కాగజ్‌నగర్‌కు తరలించిన జింకలలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి దుప్పిని తల్లి వద్దకు చేర్చాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: టైమ్‌సెన్స్ లేక నెలకు కోటి రూపాయల భారం! -
వైరల్: మీనా.. గుడ్‌బై నేస్తమా
చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee — Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021 ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్‌గా.. -
ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు ఫిదా
అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింకతో ఓ చిన్నారి ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు వేలకొద్ది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమీప పరిసరాల్లోని అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింక జనావాసంలోకి వచ్చింది. బిక్కుబిక్కుమంటూ ఓ చెత్తడబ్బా వెనక దాకొన్న జింక అటుగా వెళ్తున్న చిన్నారిని చూసి బయటకు వచ్చింది. అయితే అకస్మాత్తుగా జింక కనిపించేసరికి మొదట భయపడ్డ ఆ చిన్నారి కాసేపటికి దాన్ని ప్రేమగా నిమురుతూ సరదాగా ఆడుకుంది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటికే 11,000మంది చూసి రీట్వీట్లు చేస్తున్నారు. Tiny human meets tiny deer 🤗❤️ pic.twitter.com/SnmtXVNZvR — The Feel Good Page ❤️ (@akkitwts) December 3, 2020 -
ఈ అమ్మకు సోషల్ మీడియా సలాం!
న్యూఢిల్లీ: అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు. ఈ ఫొటో వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకుంటే మీరు అదే అంటారు. ఈ చిత్రంలో జింకపిల్లకు పాలిస్తున్న అమ్మ రాజస్థాన్‌లోని బిష్ణోయ్ సామాజిక వర్గానికి మహిళ. ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలిచిన ఈ మహిళ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ‘ఈ ఒక్క జింకపిల్లకే కాదు. తన జీవిత కాలంలో చాలా జింకపిల్లలకు చనుబాలిచ్చినట్టు ఆమె నాతో చెప్పారు. రాజస్థాన్ ఎడారుల్లో అనాథలుగా మిగిలిన, గాయపడిన ఎన్నో జింక పిల్లల ప్రాణాలు ఈవిధంగా కాపాడినట్టు వెల్లడించార’ని వికాస్ ఖన్నా వివరించారు. ప్రకృతిలోని చెట్లు, జంతువుల పట్ల బిష్ణోయ్ మహిళలు ఎంతో అనురక్తి కలిగివుంటారని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోను షేర్ చేసిన కొద్ది గంట్లోనే వేలాది లైకులు వచ్చాయి. బిష్ణోయ్ మహిళల పర్యావరణ ప్రియత్వాన్ని, సహృదయతను మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చాయి. చిప్కో ఉద్యమంలో బిష్ణోయ్ మహిళలు ముందుండి పోరాడారని, కృష్ణ జింకలను తమ సొంత పిల్లల్లా సాకుతారని పలువురు ట్వీట్ చేశారు. మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచిన ఫొటోలోని మహిళకు సలాం చెబుతూ చాలా మంది పోస్టులు పెట్టారు. -
రోడ్డు ప్రమాదంలో జింక పిల్ల మృతి
చిలమత్తూరు: మండలంలోని ఎర్ర కొండ నర్సరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన ్న సంఘటనలో రెండేళ్ల వయసున్న జింకపిల్ల మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏబీఓ కేశప్ప వెంటనే తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తరువాత స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ విజయరాజ్ను పిలిపించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం అటవీ ప్రాంతంలో జింక మృతదేహాన్ని దహనం చేయించారు.