నేటితో ముగియనున్న కేయూ రిజిస్ట్రార్ పదవీకాలం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. క్యాంపస్‌లో ని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభా గంలో ప్రొఫెసర్ అయిన సాయిలు మూడేళ్ల పాటు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించారు. అ యితే, కేయూ ఇన్‌చార్‌జ వీసీ ఆర్‌ఎం డోబ్రి యాల్ రిజిస్ట్రార్‌గా సాయిలునే కొనసాగిస్తా రా, లేదా అనేది తేలడం లేదు. కాగా, సాయి లును కొనసాగించే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలువురు ప్రొఫెసర్లు ఇన్‌చార్‌జ వీసీ డోబ్రియాల్‌ను కలిసి రిజిస్ట్రార్‌కు సంబంధించి పలు అంశాలపై ఫిర్యాదు చేశా రు.
యూనివర్సిటీలో నిబంధనలకు విరు ద్ధం గా పలువురిని నియమించారని, పరీక్షల విభాగం పనులను ప్రైవేట్ కంపెనీకి అప్పగిం చారని, నిబంధనలకు వ్యతిరేకంగా టైం స్కేల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌చార్‌జ వీసీ దృష్టికి తీసుకువె ళ్లారు. కొత్తగూడెం ఇం జినీరింగ్ కాలేజీలో నూ అక్రమాలు జరిగా య ని ఫిర్యాదులో పేర్కొ న్నారు. దీంతో సాయి లును రిజిస్ట్రార్‌గా కొన సాగిస్తారా, లేదా అనేది వేచిచూడాల్సిందే.