సోనియాతో వీహెచ్ భేటీ | v.hanumanth rao meeting with sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాతో వీహెచ్ భేటీ

Published Sun, Apr 24 2016 5:08 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలసిన ఎంపీ వి.హనుమంతరావు

శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలసిన ఎంపీ వి.హనుమంతరావు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని శనివారం ఆమె నివాసంలో కలిశారు. వచ్చే జూన్‌లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లి సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో ఓబీసీ రిజర్వేషన్లపై పోరాడానని, పదవిలో ఉన్నా, లేకున్నా బీసీల సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తానని వివరించారు. పార్టీ అభివృద్ధి కోసం ఏ పని అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లపై పోరాడతానని చెప్పారు. వీహెచ్ వెంట భార్య చంద్రకళ, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement