
రాజకీయాలకు కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్ బాయ్ చెబుతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పలు మీడియాల్లో కథనాలు హల్‌చల్ చేశాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆ ఆరోపణలకు స్పందించారు. ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. వాటిల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలకు రిటైర్మంట్ చెప్పే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..ముంబై గోవా జాతీయ రహదారి నిర్మాణ పనులను గురువారం తనిఖీ చేశామని, దాదాపు పనుల్ని పూర్తియినట్లు తెలియజేశారు.
ముండై-గోవా జాతీయ రహదారి కొంకణ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపే హైవే అని చెప్పారు. ఇది పర్యాటకానికి మంచిగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ఉన్నందున పారిశ్రామికాభివృద్ధి కూడా మంచిగా ఊపందుకుంటుందని చెప్పారు. పన్వేల్ ఇందాపూర్‌ల కోసం భూసేకరణ, పర్వావరణ అనుమతులే ఈ ముంబై-గోవా జాతీయ రహదారిని ఆలస్యం చేశాయని చెప్పారు.
ఇక ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయని, కర్నాల్ అభయారణ్యంలో ఫ్లైఓవర్‌ను తొలగించి పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..గురువారం ఉదయం రూ.కోటి విలువైన మూడు జాతీయ రహదారుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాయ్‌గఢ్ జిల్లాలోని పలాస్పే గ్రామం వద్ద 63,900 కి.మీ రూ.414.68 కోట్లతో రహదారి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, డిఘి అనే రెండు ఓడరేవుల వద్ద ఆర్థిక వృద్ధిని పెంచుతాయని గడ్కరి చెప్పారు. అయితే పన్వెల్ నుంచి కాసు హైవే వరకు శంకుస్థాపన చేయడం వల్ల ప్రయాణ వేగం తోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుందన్నారు గడ్కరీ.
(చదవండి: ‘అమృత్‌పాల్ సింగ్ లొంగిపోకూడదు.. 1984 తరహాలోనే పాక్‌కు పారిపోవాలి’)
Comments
Please login to add a commentAdd a comment