ఆగస్టు 23న బంధన్ బ్యాంక్ ప్రారంభం
కోల్‌కతా : బంధన్ బ్యాంక్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల 23వ తేదీన ప్రారంభించనున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రారంభించిన మూడేళ్లకు ఈ బ్యాంక్ 2018లో ఐపీఓకు వెళ్లాలని వ్యూహ రచన చేస్తోంది. బ్యాంక్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ సీఈఓ ఎండీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రారంభంలోనే బ్యాంక్ దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో 630 బ్రాంచీలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. వీటిలో పశ్చిమబెంగాల్‌లోనే 247 ఉంటాయి. ప్రారంభంలో బ్యాంక్ 250 ఏటీఎంలను ఆవిష్కరిస్తుంది.