
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో ఉన్న బంధన్ బ్యాంక్.. సంస్థ ప్రచారకర్తగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమించుకుంది. బ్యాంక్ సందేశాన్ని విస్తరించడంలో, సంస్థ ఉత్పత్తులు, సేవలను మరింత మందికి చేరువ చేయడంలో సౌరవ్ గంగూలీ సహాయపడతారని బంధన్ బ్యాంక్ తెలిపింది. 34 రాష్ట్రాల్లో 5,644 బ్యాంకింగ్ ఔట్‌లెట్స్ ద్వారా సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. మార్చి నాటికి కొత్తగా 551 శాఖలను తెరుస్తోంది.
టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ... బీసీసీఐ బాస్‌గా గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడ్డా అది కుదరలేదు. ఈ విషయంలో బీసీసీఐ బోర్డు పెద్దలు అంగీకరించకపోవడంతో దాదా అయిష్టంగానే పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
చదవండి: బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే!