బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI Green Signal for Bandhan Bank Ipo | Sakshi
Sakshi News home page

బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Published Wed, Mar 7 2018 12:44 AM | Last Updated on Wed, Mar 7 2018 12:44 AM

SEBI Green Signal for Bandhan Bank Ipo - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓకు(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ బ్యాంక్‌.. ఈ ఏడాది జనవరి 1న సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,500 కోట్లు సమీకరించనుంది. భారత బ్యాంకింగ్‌ రంగంలో ఇదే అతి పెద్ద ఐపీఓ అని మర్చంట్‌ బ్యాంకర్ల సమాచారం. ఈ ఐపీఓలో భాగంగా 9,76,63,910 తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఈ బ్యాంక్‌ భాగస్వాములు– ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌సీ), ఐఎఫ్‌సీ ఎఫ్‌ఐజీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు కలిసి 1,40,50,780 షేర్లను విక్రయిస్తాయి. ఒక బ్యాంక్‌గా మారిన తొలి సూక్ష్మ రుణ సంస్థ ఇది.  భవిష్యత్‌ మూలధన అవసరాలకు ఈ ఐపీఓ నిధులను వినియోగించుకోవాలని బ్యాంక్‌ యోచిస్తోంది. 2014లో ఆర్‌బీఐ బంధన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐడీఎఫ్‌సీలకు బ్యాంక్‌ లైసెన్స్‌లు జారీ చేసింది.

ఈ నెల 13 నుంచి భారత్‌ డైనమిక్స్‌ ఐపీఓ 
హైదరాబాద్‌ కేంద్రంగా  క్షిపణులు, ఇతర రక్షణ సంబంధిత పరికరాలు తయారు చేస్తోన్న భారత్‌ డైనమిక్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 15న ముగిసే ఈ ఐపీఓకు ధరల శ్రేణిని కంపెనీ రూ.413–428గా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 15న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.961 కోట్లు సమీకరిస్తుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement