ముంబై: ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ తగ్గింపు విషయానికి సంబంధించి బంధన్ బ్యాంక్‌కు కొంత ఊరట లభించింది. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్లు ఏడాది దాకా వాటాలను విక్రయించకుండా చేసే నిబంధన విషయంలో తమకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపు లభించినట్లు బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ లైసెన్సింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటింగ్ సంస్థ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (బీఎఫ్‌హెచ్‌ఎల్).. బంధన్ బ్యాంకులో తనకున్న 82 శాతం వాటాలను 40 శాతానికి తగ్గించుకోవాలి.
లాకిన్ వ్యవధి నిబంధనలు తదితర అంశాల నేపథ్యంలో బీఎఫ్‌హెచ్‌ఎల్ దీన్ని అమలు చేయడంలో విఫలమైంది. ఇందుకు గాను బంధన్ బ్యాంకు.. కొత్త శాఖలు తెరవకుండా, ఎండీ చంద్రశేఖర్ ఘోష్ జీతభత్యాలను పెంచకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో లాకిన్ వ్యవధికి సంబంధించి సెబీ కొంత మినహాయింపునిచ్చింది. దీంతో ప్రమోటర్ వాటాను తగ్గించుకునేందుకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) లేదా ఇతర సంస్థల విలీన, కొనుగోలు తదితర మార్గాలను పరిశీలించనున్నట్లు ఘోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment