కేంద్రానికి ఆర్థిక రంగం బడ్జెట్ వినతులు
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయాలని కేంద్రాన్ని ఆర్థిక రంగం విజ్ఞప్తి చేసింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఏడో ప్రీ–బడ్జెట్ సమావేశంలో ఆర్థిక రంగం ప్రతినిధులు ఈ మేరకు వినతులు ఇచ్చారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలను కూడా తెలియజేసినట్లు ఎడెల్విస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్ విండోను ఏర్పాటు చేయాలని నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కోరినట్లు ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఐడీసీ) డైరెక్టర్ రమణ్ అగర్వాల్ వివరించారు. గృహ రుణాల కంపెనీల తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి రీఫైనాన్సింగ్ చేసేందుకు సిడ్బి, నాబార్డ్‌ల కోసం నిర్దిష్ట ఫండ్‌ను ఏర్పాటు చేయొచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment