Budget proposals
-
AP Budget 2023-24: బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు.. మార్గదర్శకాలు ఇవే
సాక్షి, అమరావతి: అందుబాటులో ఉన్న వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేలా 2023 – 24 ఆర్థిక ఏడాది బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సూచించింది. ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు, రవాణా రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలు అందుకు అనుగుణంగా ఉండాలని సూచించింది. వేగంగా పారిశ్రామీకరణ ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచి లక్ష్యాలను సాధించేలా క్యాపిటల్ వ్యయం ప్రతిపాదనలు ఉండాలని పేర్కొంది. 2022–23 బడ్జెట్ అంచనాల సవరణ ప్రతిపాదనలను వాస్తవికంగా రూపొందించాలని సూచించింది. ఈమేరకు ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించేందుకు మార్గదర్శకాలతో ఆర్థిఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాధిపతులు, బడ్జెట్ అంచనాల అధికారులు బడ్జెట్ ప్రతిపాదనల అంచనాలను డిసెంబర్ 10లోగా ఆన్లైన్లో సమర్పించాలి. సంబంధిత శాఖల కార్యదర్శులు తమ అభిప్రాయాలను జోడించి డిసెంబర్ 12లోగా ఆర్థికశాఖకు ఆన్లైన్లో పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2023 – 24 బడ్జెట్ అంచనాల రూపకల్పనకు సంబంధించి ఆర్థిక శాఖ బుధవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలు ఇవీ ♦నవ రత్నాలు, కేంద్ర పథకాలకు తగినన్ని నిధులు కేటాయింపులు ఉండేలా బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలి. నవరత్నాల పథకాల వారీగా శాఖాధిపతులు ఆన్లైన్లో నమూనా పత్రంలో బడ్జెట్ అంచనా ప్రతిపాదనలు చేయాలి. మేనిఫెస్టోలోని పథకాల అమలు వివరాలతో బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను చేయాలి. సామాజిక పెన్షన్లు, సబ్సిడీలకు తగినన్ని నిధులు ప్రతిపాదించాలి. ♦కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్ర అభివృద్థి పథకాలు, విదేశీ సాయంతో అమలు చేస్తున్న పథకాల వివరాలను ఆన్లైన్లో సంబంధిత పద్దుల్లో బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదించాలి. ♦బడ్జెట్ అంచనా ప్రతిపాదనలు వాస్తవిక వ్యయం, అవసరాల ఆధారంగా ఉండేలా తగిన కసరత్తు చేయాలి. ఊహాజనితంగా, వాస్తవికతకు దూరంగా ప్రతిపాదనలు ఉండకూడదు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం సవరించిన అంచనాలు, వచ్చే ఆరి్థక ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల మధ్య భారీ వ్యత్యాసం ఉంటే అందుకు సహేతుక కారణాలను కచ్చితంగా వివరించాలి. ♦పరిపాలనా వ్యయానికి సంబంధించి అద్దెలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ సంబంధిత బడ్జెట్ ప్రతిపాదనలను గత మూడేళ్ల వాస్తవ గణాంకాలతో పంపించాలి. ♦నీటి చార్జీలు, విద్యుత్ చార్జీలను రెండుగా విభజించి కొత్త పద్దు కింద ప్రతిపాదించాలి. విద్యుత్ చార్జీలను ఇంధన శాఖ బడ్జెట్లో పొందుపరచాలి. ప్లీడర్ ఫీజులు, న్యాయాధికారుల గౌరవ వేతనాలను న్యాయశాఖలో ప్రతిపాదించాలి. ♦నిష్ప్రయోజన వ్యయాలను నివారించడంతో పాటు జీతాలేతర వస్తువులపై వ్యయాన్ని విశ్లేషించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 20% తగ్గించేలా అంచనా ప్రతిపాదనలుండాలి. ♦ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉప ప్రణాళికలు రూపొందించాలి. ♦మహిళలు, పిల్లల కోసం అమలు చేసే పథకాలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపు ప్రతిపాదనలు చేయాలి ♦ప్రస్తుత పన్ను రేట్లు, చార్జీల ప్రకారమే ఆదాయ రాబడుల అంచనా ప్రతిపాదనలు చేయాలి. పన్నేతర ఆదాయంపై దృష్టి సారించాలి. పన్ను బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ♦కన్సల్టెంట్లు, ఔట్సోర్సింగ్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను పరిమితం చేయాలి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎటువంటి నియామకాలు చేపట్టరాదు. అత్యవసర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలు కొనుగోలు చేయరాదు. చదవండి: ఇప్పటం లోగుట్టు లోకేష్‌కు ఎరుక.. ఆర్కే తనదైన శైలిలో.. -
ట్యాక్స్ ఫ్రీ పీఎఫ్.. కేంద్రం గుడ్ న్యూస్!
పన్ను రహిత ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచే సూచనలు బడ్జెట్ 2022-2023లో స్పష్టంగా కనిపిస్తున్నాయి!. పీఎఫ్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఇకపై రూ. 5 లక్షల వరకు జమ చేసుకునే ఉద్యోగులందరికీ(ప్రైవేట్ కూడా!) వడ్డీపై పన్ను ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయలుగా ఉన్న పీఎఫ్ ట్యాక్స్ ఫ్రీ పరిమితిని.. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెట్టింపు చేసే అవకాశం కనిపిస్తోంది. జీతం ఉన్న ఉద్యోగులందరికీ సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు చేయొచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులను ఈ గొడుగు కిందకు తీసుకొచ్చేందకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు కొన్ని ఆర్థిక సంబంధమైన బ్లాగుల్లో కథనాలు కనిపిస్తున్నాయి. 2021-22 ఉద్యోగుల సమయంలో.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను భారాన్ని తగ్గిస్తూ లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఉద్యోగి తరఫున భవిష్యనిధి ఖాతాకు కంపెనీ తన వాటా జమ చేయనట్టయితే.. అటువంటి కేసులకు రూ.5లక్షల పరిమితి వర్తిస్తుందని మంత్రి వెసులుబాటు కల్పించారు. అయితే పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని, ఇది వివక్షతో కూడుకున్నదని నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో.. తాజా నిర్ణయం అమలులోకి వస్తే.. జీతం ఎత్తే ఉద్యోగులందరికీ ఈ లిమిట్‌ను 5 లక్షల దాకా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనను సవరించాలంటూ ప్రభుత్వానికి అనేక ప్రాతినిధ్యాలు అందాయి. ప్రాథమికంగా ఈ నిబంధన.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే అంశం కాబట్టి, ఇది వివక్షత లేనిదిగా ఉండాలని, జీతాలు తీసుకునే ఉద్యోగులందరినీ దీని పరిధిలోకి తీసుకురావాలని నొక్కిచెప్పాయి. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త.. లక్ష రూ. దాకా.. -
హైవేపై బాదుడే..
సాక్షి, న్యూఢిల్లీ : టోల్ రేట్లను జాతీయ హైవేల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) ఏడు శాతం మేర సవరించడంతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రాకపోకలు ఆదివారం నుంచి పెనుభారం కానున్నాయి. టోల్ రేట్ల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా పలు వస్తువుల ధరల్లో ఆదివారం నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్లో పలు పన్నులు, లెవీల్లో మార్పులకు అనుగుణంగా ఆయా వస్తువులు, ధరలు ప్రభావితమవుతాయి. మరోవైపు రూ లక్షకు మించిన షేర్ల అమ్మకాలపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును కేంద్రం తిరిగి ప్రవేశపెట్టింది. భారమవనున్న వస్తువులను చూస్తే..దిగుమతి చేసుకునే మొబైల్ హ్యాండ్సెట్లు, పెర్ఫ్యూమ్లు, సౌందర్య సాధనాలు, వాచీలు, కళ్లజోళ్లు, జెమ్‌స్టోన్స్, డైమండ్స్, చెప్పులు, సిల్క్ వస్ర్తాలు, జ్యూస్‌లు, ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, దిగుమతయ్యే బంగారు ఆభరణాల ధరలకు రెక్కలురానున్నాయి. . ఇక ముడి జీడిపప్పు, సోలార్ సెల్స్, ప్యానెల్స్, మాడ్యూల్స్, ఇతర ముడిపదార్థాల ధరలు కొంతమేర దిగిరానున్నాయి. -
బ్యాంకులకు 7,940 కోట్లు
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.7,940 కోట్ల మూలధన పెట్టుబడులను బడ్జెట్ ప్రతిపాదించింది. 2011 నుంచి 2014 వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ పెట్టుబడుల మొత్తం రూ.58,600 కోట్లు. అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి బాసెల్-3 అమలుకు బ్యాంకులకు మూలధన పెట్టుబడులుగా రానున్న రెండు, మూడేళ్లలో రూ. 2.4 లక్షల కోట్లు అవసరం అవుతాయని అంచనా. సర్ఫేసీ చట్ట పరిధిలోకి ఎన్బీఎఫ్సీలు: సర్ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్‌ట్రస్ట్ యాక్ట్, 2002) చట్ట పరిధిలోకి దిగ్గజ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బడ్జెట్ తీసుకువచ్చింది. ఎన్బీఎఫ్సీలు రుణ రికవరీ ప్రక్రియ సత్వర పరిష్కారం కావడానికి, మొండి బకాయిల సమస్యలపై కఠిన చర్యలకు ఈ చర్య దోహదపడుతుంది. ఆర్బీఐ వద్ద రిజిస్టరై, రూ.500 కోట్ల వరకూ ఆస్తుల పరిమాణం ఉన్న ఎన్బీఎఫ్సీలను సర్ఫేసీ యాక్ట్ కిందకు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ ప్రతిపాదించింది. అటానమస్ బ్యాంక్స్ బోర్డ్ అటానమస్ (స్వతంత్ర) బ్యాంక్ బోర్డ్ బ్యూరో ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. మూలధన సమీకరణపై బ్యాంకలకు ఇది స్వేచ్ఛ కల్పిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక విధానంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. బ్యాంకులకు హోల్డింగ్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏర్పాటు దిశలో ఇది ముందడుగు.