బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.
మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్‌తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.
గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్‌లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్‌లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్‌ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్‌ను కలిగి ఉంది.
ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
గూగుల్ తన ఉత్పత్తులను భారత్‌లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment