కొత్తపేట్‌లో సినీనటి రాశీకన్నా సందడి | rashi khanna launched rs brothers show room | Sakshi
Sakshi News home page

కొత్తపేట్‌లో సినీనటి రాశీకన్నా సందడి

Published Fri, Sep 2 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ షోరూమ్‌ ప్రారంభించిన రాశీకన్నా

ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ షోరూమ్‌ ప్రారంభించిన రాశీకన్నా

సాక్షి,సిటీబ్యూరో: ప్రముఖ వస్త్రాల షోరూమ్‌ ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ 12వ షోరూమ్‌ను శుక్రవారం కొత్తపేట్‌లో ప్రముఖ సినీనటి రాశీకన్నా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ షోరూం సకుటుంబ వస్త్ర ప్రపంచంగా   కొనియాడారు. రిటెయిల్‌ రంగంలో ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ ఒక సంచలనమన్నారు. ఈ షోరూమ్‌లో ఉన్న డిజైన్లు,వివిధ రకాల వస్త్రాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయన్నారు. కోఠిలో ఒక షోరూమ్‌తో ప్రారంభమైన  కాగా ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ ప్రస్తానం నేడు 12 షోరూమ్‌లకు చేరుకుందన్నారు.

పురుషులు,మహిళలు,చిన్నారులకు నెం.1 షాపింగ్‌ మాల్‌ ఇదేనన్నారు. దశలవారీగా తెలంగాణా,ఏపీలోని ప్రముఖ నగరాల్లో ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ షోరూమ్‌లను తెరవనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు సురేష్‌ సీమా, స్పందన, అభినవ్, రాకేష్, కేశవ్‌లు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో నెం.1 షాపింగ్‌ మాల్స్‌ను ఆర్‌.ఎస్‌.బ్రదర్స్‌ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత 25 ఏళ్లుగా వినియోగదారులకు సకుటుంబ, సపరివార, ఆధునిక వస్త్రాలను సరసమైన ధరల్లో అందజేస్తున్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement