
చీరలను ప్రదర్శిస్తున్న నభా. చిత్రంలో యాజమాన్యం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఆర్పీరోడ్‌లోని ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో సినీ నటి నభా నటేష్ సందడి చేసింది. ఆధునికీకరించిన షో రూమ్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ.. ఆర్‌ఎస్ బ్రదర్స్‌లోని కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని, సకుటుంబంగా షాపింగ్ చేసేలా దుస్తులు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొంది. షోరూం డైరెక్టర్లు పి. వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, సత్యనారాయణ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లతో, అందమైన దుస్తులను అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment