
మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గురువారం హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. హీరోయిన్ నబా నటేష్ పాల్గొని సందడి చేసింది.
మాదాపూర్: హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన డిజైనింగ్ వస్త్రాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్‌లోనిహెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన హైలైఫ్ ఎగ్జిబిషన్‌ను నటీ నబా నటేష్, మిస్ గ్రాండ్ ఇండియా– 2019 శివానీజాదవ్, అదితీ హుందియాలు గురువారం ప్రారంభించారు. 400 మంది డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు నగర యువతను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. మహిళలు ఎక్కువగా అధునాతనడిజైన్లతో కూడిన ఆభరణాలు, వస్త్రాలను ఇష్టపడతారన్నారు. వివాహాది శుభకార్యాలకు హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.నిర్వాహకుడు డొమినిక్ మాట్లాడుతూ మూడు రోజుల పాటునిర్వహించనున్న హైలైఫ్ ఎగ్జిబిషన్‌లో గృహాలంకరణ వస్తువులతో పాటు వస్త్రాభరణాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment