లాట్ మొబైల్ 101వ స్టోర్ విజయవాడలో
ప్రముఖ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ సోమవారం విజయవాడలో తన 101వ స్టోర్‌ను ప్రారంభించింది. బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్ అభిమానుల ఆనందోత్సాహాల మధ్య ఈ స్టోర్‌ను ప్రారంభించారు. విజయవాడలో సంస్థకు ఇది ఆరవ స్టోర్.
పండుగ ఆఫర్లు...
దీపావళిని పురస్కరించుకుని సంస్థ ‘‘లాట్ స్మార్ట్ ఫెస్ట్’ పేరుతో పలు ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్స్6, 6 ప్లస్ కొనుగోళ్లపై రూ.8,000 విలువైన ప్రయోజనాలు- ఒక మొబైల్ కొంటే 2 నుంచి 4 వరకూ మొబైల్స్ ఉచితం- మొబైల్ కొంటే మెమెరీ కార్డ్, పవర్ బ్యాంక్ ఉచితం- రూ.4,999కే రెండు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌లు- రూ.9,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.8,000 విలువచేసే ట్యాబ్‌లెట్ ఉచితం- రూ.6,999 స్మార్ట్ మొబైల్ కొంటే రూ.5,000 ట్యాబ్‌లెట్ ఉచితం- రూ.2,000కే 3జీ మొబైల్ వంటి ఆఫర్లు ఇందులో ఉన్నాయి.
అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోళ్లు చేయవచ్చని, ప్రతి కొనుగోలుపై ఒక ఖచ్చిత బహుమతి పొందవచ్చని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. లాట్ మొబైల్స్ షోరూమ్‌లన్నింటినీ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని, అన్ని బ్రాండెడ్ మొబైల్స్ డెమోలు, అత్యాధునిక యాక్సెసరీలను అందుబాటులో ఉంచామన్నారు.