
తెలుగు సినిమా ఇప్పుడు ఎల్లలు దాటిపోయింది. బాహుబలికి వచ్చిన గుర్తింపు కావొచ్చు, ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటుకు వచ్చిన ఆస్కార్ కావొచ్చు. మన సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక పాటల గురించైతే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అలానే 'పుష్ప 2'లోని(Pushpa 2 Movie) పీలింగ్స్ పాట గ్లోబల్ స్టేజీ దద్దరిల్లిపోయేలా చేసింది.
మన దగ్గర బాస్కెట్ బాల్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు గానీ అమెరికాలో ఈ ఆటకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్బీఏ అయితే ఎప్పటికప్పుడు మ్యాచులు నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా అలానే అమెరికాలోని టెక్సాస్ లో హ్యూస్టర్ రాకెట్స్ vs మిల్వాకీ బక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. విరామ సమయంలో స్టేడియంలో కూర్చున్న వీక్షకుల్ని అలరించేందుకు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేశారు.
(ఇదీ చదవండి: కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్?)
ఇందులో భాగంగా 45 మంది డ్యాన్సర్స్.. పుష్ప 2చిత్రంలోని పీలింగ్స్ పాటకు (Peelings Song) స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫీవర్ గ్లోబల్ స్టేజీ వరకు వెళ్లిందని బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
గతేడాది డిసెంబర్ 5న 'పుష్ప 2' (Allu Arjun) థియేటర్లలో రిలీజైంది. రూ.1800 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
A grand tribute to Icon Star @alluarjun & #Pushpa2 at the Houston Rockets vs Milwaukee Bucks game during the halftime show at @NBA!
A proud and historic moment, celebrating Indian cinema and culture on a global stage! 🌍🇮🇳#Pushpa2TheRule #AlluArjunpic.twitter.com/hEjhB9K2Pf— Milagro Movies (@MilagroMovies) February 27, 2025