లాట్ మొబైల్స్ 100వ షోరూమ్
ప్రారంభించిన అల్లు అర్జున్
యానివర్సరీ సేల్ ఆఫర్లు, బ్రాండెడ్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ తాజాగా తమ 100వ షోరూమ్ ‘స్మార్ట్ లాంజ్’ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నటుడు అల్లు అర్జున్ శనివారం దీన్ని ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీలతో లాట్ మొబైల్స్ 2012లో ప్రభంజనంలా దూసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో 50వ స్టోర్‌ని, ఏడాది తిరగ్గానే ఈ ఆగస్టులో వందో స్టోర్‌ని ప్రారంభించడం సంస్థ శరవేగంగా వృద్ధి చెందుతున్న తీరుకు నిదర్శనమన్నారు. మొదటి సేల్ కింద షోరూమ్‌లో రూ. 7.8 లక్షలు విలువ చేసే వర్చ్యు ఫోన్‌ని కొనుగోలు చేసిన కస్టమర్‌కి అల్లు అర్జున్ మొబైల్‌ని అందజేశారు.
ఆఫర్లు..
వార్షికోత్సవాలను పురస్కరించుకుని లాట్ మొబైల్స్ పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. 15 రోజుల ట్రయల్ ఆఫర్ కింద.. కొనుగోలు చేసిన మొబైల్ నచ్చకపోతే 15 రోజుల్లో అంతే విలువ చేసే మరో మోడల్‌తో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఇక, బ్రాండెడ్ మొబైల్స్‌పై 66% దాకా డిస్కౌంటు, ఒక మొబైల్ కొంటే 2 మొబైల్స్ ఉచితం, ఎంపిక చేసిన మొబైల్స్‌పై రూ. 3,000 విలువైన బహుమతులు వంటివి ఇందులో ఉన్నాయి.
స్టోర్ ప్రత్యేకతలివీ..
రెండు అంతస్తుల్లో సుమారు 3,000 చ.అ.ల విస్తీర్ణంలో స్టోర్‌ని లాట్ మొబైల్ ఏర్పాటు చేసింది. కస్టమర్లు వివిధ ఫోన్లను పోల్చి చూసుకుని తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకునేందుకు వీలుగా ఇందులో ప్రత్యేకంగా టచ్ ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉం టుంది. ట్యాబ్స్ కోసం ప్రత్యేక జోన్, సోనీ ఆగ్యుమెంటెడ్ గేమింగ్ జోన్ వంటివి దీనిలో ఉన్నాయి. అలాగే పాటలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు మ్యూజిక్ జూక్ బాక్స్, కస్టమర్లు తమకు నచ్చిన ఫొటోలను తమ మొబైల్స్ బ్యాక్ ప్యానెల్స్‌పై ప్రింట్ చేసుకునేందుకు వీలుగా ఇన్‌స్టా ప్రింట్ వంటి వివిధ సర్వీసులు ఈ లాంజ్‌లో అందుబాటులో ఉంటాయి.