లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి సందర్భంగా స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. 50% అస్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్‌లో లాట్ కస్టమర్లు 6 నెలలలోపు ఎప్పుడైనా తమ ఫోన్ కొన్న ధరలో 50% ధరతో ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఫోన్‌ను కొనుక్కోవచ్చు. 15 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌ను సైతం లాట్ మొబైల్స్ ప్రవేశపెట్టింది.
ఫోన్ నచ్చకపోతే కొన్న తేదీ నుండి 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి వేరే బ్రాండ్ మొబైల్‌ను తీసుకోవచ్చు. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై 2 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ నేషనల్ వారెంటీ అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఫోన్లపై డిస్కౌంట్, స్మార్ట్ ఫెస్ట్‌లో ప్రతి కొనుగోలుపై ఖచ్చిత బహుమతి ఉంది. డిసెంబరుకల్లా మరో 25 షోరూంలను తెరుస్తున్నట్టు లాట్ ప్రతినిధి వెల్లడించారు.