లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు
హైదరాబాద్: మల్టీబ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించే మొబైల్ రిటైల్ చెయిన్ లాట్ మొబైల్స్ సంక్రాంతి సందర్బంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ప్రముఖ హీరో రాణా, హీరోయిన్ తాప్సీలు ఆవిష్కరించిన సంక్రాంతి ఆఫర్లు స్మార్ట్‌ఫోన్లపైనే కాకుండా, ఫీచర్ ఫోన్లపైనా అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఐఫోన్ 4 ఎస్, ఎల్‌జీ జీ3 మొబైళ్ల కొనుగోలుపై రూ.10,000 ఆదా చేసుకోవచ్చని, నోకియా లూమియా 1320 కొంటే మరో నోకియా లూమియా ఫోన్ ఉచితమని, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 కొంటే మరో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ ఉచితమని, రూ.10,000 విలువున్న మైక్రోమ్యాక్స్ డూడుల్3 కొంటే మైక్రోమ్యాక్స్ పీ280 ట్యాబ్ ఉచితమని, ఈ ఆఫర్ ద్వారా రూ.4,000 ఆదా చేసుకోవచ్చని వివరించింది. రూ.2,000 కే 2 మొబైళ్లు కొనుగోళ్లు చేయవచ్చని, రూ.1,000 విలువ గల ఆ మెమెరీ కార్డులు అందిస్తామని వివరించింది.
ఒక సెల్‌కాన్ మొబైల్ కొంటే 2 ఫీచర్ ఫోన్‌లు ఉచితమని, సోనీ ఎక్స్‌పీరియా సీ3 మొబైల్ కొనుగోలుపై రూ.5,000 ఆదా చేసుకోవచ్చని పేర్కొంది. ప్రతి కొనుగోలుపై ఒక ఖచ్చితమైన బహుమతి పొందవచ్చని లాట్ తెలిపింది.