లాట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్స్
హైదరాబాద్: ప్రముఖ మల్టీ బ్రాండ్ స్మార్ట్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్స్’ తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు ‘స్మార్ట్ ఫీస్ట్ సేల్’ పేరుతో పలు రకాల ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ ఫీస్ట్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.31,000ల విలువ గల మెగా కాంబో ఆఫర్‌ను రూ.13,000లకే సొంతం చేసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే ఇంటెక్స్ ఆక్వా టర్బో 4జీ, ఐఫోన్ 6ఎస్, లెనొవొ ఏ5000, శాంసంగ్ గ్యాలక్సీ ఏ5, ఇంటెక్స్ వై2 పవర్, మైక్రోమ్యాక్స్ బోల్ట్ క్యూ335 వంటి తదితర మొబైల్ హ్యాండ్‌సెట్స్ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్, పవర్ బ్యాంక్, హెడ్‌సెట్, ఐఫోన్ 4ఎస్, మెమరీ కార్డులు, సెల్ఫీ స్టిక్, ఇంటె క్స్ డీవీడీ ప్లేయర్ వంటి తదితర వాటిని ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు ప్రతి కొనుగోలుపై ఒక కచ్చితమైన బహుమతి పొందొచ్చని తెలిపింది.