ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్‌ని అందిస్తుంది. గతంలో రెడ్‌మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి.
భారత్‌లో రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 ధర
రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్‌మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
పైన పేర్కొన్నట్లుగా రెడ్‌మీ స్మార్ట్‌ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్‌డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్‌ల సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్‌లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్‌గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్‌ను అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్‌బీ పోర్ట్‌లు, ఏవీ ఇన్‌పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది.
ఇది కాకుండా రెడ్‌మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్‌లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్‌తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్‌లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ కోసం హాట్‌కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్‌లు, మ్యూట్ బటన్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment