ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్! | Flipkart Big Bachat Dhamaal sale: Best deals on smart TV MI, SONY, One Plus | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!

Published Mon, Jan 31 2022 8:32 PM | Last Updated on Mon, Jan 31 2022 9:20 PM

Flipkart Big Bachat Dhamaal sale: Best deals on smart TV MI, SONY, One Plus - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌ కొద్ది రోజుల క్రితమే 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సేల్‌తో మీ ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ "బిగ్ బచత్ ధమాల్" సేల్‌ను ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు నిరహిస్తున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్ దుస్తులు, టీవీలు, సౌందర్య ఉత్పత్తులు, హోమ్, కిచెన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల మీద మంచి ఆఫర్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ప్రత్యేకంగా టీవీల మీద అందిస్తున్న ఆఫర్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

► ఎంఐ 4ఏ ప్రో: ఎంఐ 4ఏ ప్రో 80 సెం.మీ(32 అంగుళాలు) స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవి రూ.16,999 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టివి అసలు ధర రూ.19,999, అంటే మీరు ఈ స్మార్ట్ టివి మీద 15 శాతం తగ్గింపును పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా మీరు 10 శాతం తగ్గింపును పొందవచ్చు.
► సోనీ బ్రావియా: సోనీ బ్రావియా డబ్ల్యూ820 108 సెం.మీ(43 అంగుళాలు) టీవి అసలు ధర కంటే రూ.6 వేలు తక్కువ(రూ.28,999) ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.34,900గా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవి మీద 16 శాతం తగ్గింపు పొందవచ్చు. 
► వన్ ప్లస్ వై సిరీస్: వన్ ప్లస్ వై సిరీస్ 100 సెం.మీ (40 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.27,999 నుంచి రూ.22,499కు తగ్గింది. ఎంపిక చేసిన యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలపై మీరు అదనంగా రూ.2000 తగ్గింపు పొందవచ్చు.
► వు ప్రీమియం: వు ప్రీమియం 139 సెం.మీ(55 అంగుళాలు) స్మార్ట్ టీవి ధర రూ.75,000 నుంచి రూ.42,990కు తగ్గింది. ఈ స్మార్ట్ టివి మీద మీకు సుమారు 42 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఇంకా ఎల్ జీ 108 సెం.మీ స్మార్ట్ టీవి, రియల్ మీ 108 సెం.మీ స్మార్ట్ టీవి మీద మంచి మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

(చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement