
బీజింగ్: షావోమి తాజాగా స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా ఎంఐ టీవీ 5, ఎంఐ టీవీ 5 ప్రో పేరుతో బీజింగ్‌లో కంపెనీ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్‌లో భాగంగా మంగళవారం లాంచ్ చేసింది. 55-అంగుళాలు, 65, 75-అంగుళాల స్క్రీన్ పరిమాణాలలో ఈ స్మార్ట్‌టీవీలను తీసుకొచ్చింది.
ఎంఐ టీవీ 5 ప్రొ ధరలు
55 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో మోడల్ ధర సిఎన్‌వై 3,699 (సుమారు రూ. 37,200)
65 అంగుళాల ఎంఐ టీవీ 5ప్రో సిఎన్‌వై 4,999 (సుమారు రూ .50,300)
75 అంగుళాల మోడల్ ధర సిఎన్‌వై 9,999 (సుమారు రూ .100,500)
ఎంఐ టీవీ 5 ధరలు
55 అంగుళాల మోడల్‌కు సిఎన్‌వై 2,999 (సుమారు రూ .30,200)
65 అంగుళాల ఎంఐ టీవీ 5 మోడల్ ధర సిఎన్‌వై 3,999 (సుమారు రూ .40,200)
75 అంగుళాల మోడల్ ధర సిఎన్‌వై 7,999 (సుమారు రూ. 80,400)
అల్యూమినియం ఫ్రేమ్.అమ్లాజిక్ టి 972 సోసి, ప్యాచ్‌వాల్ యూజర్ ఇంటర్‌ఫేస్.8 కె వీడియో ప్లేబ్యాక్, వై-ఫై 802.11 ఎసి, మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఎవి ఇన్‌పుట్‌లు, బ్లూటూత్ 4.2, 4 మైక్రోఫోన్లు, రెండు 8 డబ్ల్యూ నాలుగు-యూనిట్ స్పీకర్లు, షావోమి వాయిస్ అసిస్టెంట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఈ స్మార్ట్‌టీవీలలో పొందు పర్చింది. ఎంఐ టీవీ 5లో 3 జీబీ ర్యామ్/32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉండగా, ఎంఐటీ 5 ప్రో 4జీబీ ర్యామ్/ 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వచ్చింది. చైనాలో నవంబర్ 11 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయని షావోమి తెలిపింది. అయితే ఇతర మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి తెచ్చేది వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment