న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా తమ ఫైర్ టీవీ బ్రాండ్ స్మార్ట్ టీవీలను భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఒనిడా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 32 అంగుళాల ఒనిడా ఫైర్ టీవీ స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌డాట్‌ఇన్ పోర్టల్‌లో వీటి విక్రయం ప్రారంభమవుతుంది. ఈ ఫుల్ హెచ్‌డీ టీవీల్లో బిల్టిన్ వైఫై, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్టు, 1 ఇయర్‌ఫోన్ పోర్టు తదితర ఫీచర్స్ ఉంటాయి.
ఫైర్ టీవీ స్మార్ట్ టీవీలను 2018లో అమెరికా, కెనడాలో అమెజాన్ పవ్రేశపెట్టింది. ఈ ఏడాది బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల్లోకి విస్తరించింది. ఇందుకోసం డిక్సన్స్ కార్‌ఫోన్, మీడియామార్కెట్ శాటర్న్, గ్రండిగ్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. భారత్‌లో ఒనిడాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇతర సంస్థలతో కూడా కలిసి పనిచేసే అవకాశాలున్నాయని ఫైర్ టీవీ డివైజెస్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సందీప్ గుప్తా తెలిపారు. అమ్మకాల లక్ష్యాలను మాత్రం వెల్లడించలేదు.
నాణ్యమైన పిక్చర్, సౌండ్ ఫీచర్స్‌తో అందుబాటు ధరల్లో ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ లభిస్తుందని మిర్క్ ఎలక్ట్రానిక్స్ (ఒనిడా) బిజినెస్ హెడ్ సునీల్ శంకర్ తెలిపారు. అమెజాన్ ప్రస్తుతం భారత్‌లో ఫైర్ టీవీ స్ట్రీమింగ్ స్టిక్‌లు, ఎకో (స్మార్ట్ స్పీకర్స్), కిండిల్ (ఈ–బుక్ రీడర్) వంటి ఉత్పత్తులు విక్రయిస్తోంది.
దేశీ మార్కెట్లోకి అమెజాన్ ఫైర్ టీవీలు
Published Thu, Dec 12 2019 2:59 AM | Last Updated on Thu, Dec 12 2019 2:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment