శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్ | Samsung launches new Frame 2020 and other | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కొత్త టీవీలు: ఫీచర్లు అదుర్స్

Published Tue, Jun 16 2020 3:16 PM | Last Updated on Tue, Jun 16 2020 4:18 PM

Samsung launches new Frame 2020 and other - Sakshi

సాక్షి, ముంబై : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, శాంసంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా  తమ సరికొత్త టీవీలు  అందుబాటులో ఉంటాయని  కంపెనీ ప్రకటించింది.  వీటిల్లో ఫ్రేమ్ 2020 ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఆన్‌లైన్ స్మార్ట్ టీవీ శ్రేణి 4 కే యూహెచ్‌డి, ఎఫ్‌హెచ్‌డి , హెచ్‌డి రెడీ పేరుతో ఆవిష్కరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 'గెట్ మోర్ ఫ్రమ్ టీవీ' అంటూ, అమెజాన్‌లో 'వండర్‌టైన్ మెంట్' అంటూ ప్రచారం చేస్తోంది.

ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి 48 గంటల్లో ప్రీ-పెయిడ్ (క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి) వినియోగదారులకు రూ.1500ల అదనపు తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుందని శాంసంగ్ ప్రకటించింది. అలాగే అమెజాన్ వినియోగదారులకు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ప్రీ-పెయిడ్ లావాదేవీలపై రూ .1000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. దీంతోపాటు సులభ ఈఎంఐ ఆప్షన్స్ కూడా లభ్యం. 

కొత్త ఎడిషన్ స్మార్ట్ టీవీలు యువ మిలీనియల్స్, ఆన్‌లైన్ కంటెంట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తీసుచ్చామని సంస్థ పేర్కొంది. ఆటో హాట్‌స్పాట్ టెక్నాలజీ, యుఎస్‌బి 3.0, శాంసంగ్ బిక్స్‌బైతో పాటు గూగుల్ అసిస్టెంట్,  అమెజాన్ అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను వీటిల్లో జోడించింది. ఆకర్షణీయమైన కంటెంట్, క్యాష్‌బ్యాక్‌ తమ వినియోగదారులకు అందించే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో భాగస్వామ్యం కుదర్చుకున్నామని శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఆన్‌లైన్ బిజినెస్ డైరెక్టర్ పియూష్ కున్నపల్లిల్ చెప్పారు.

స్పెషాలిటీ ఏంటంటే..
ఈ టీవీలు పర్సనల్ కంప్యూటర్ మోడ్‌తో కూడా వస్తాయి, వినియోగదారులు తమ టీవీని పూర్తి స్థాయి పీసీగా వాడుకోవచ్చు. దీనితో వర్క్ ఫ్రం హోం వినియోగదారులకు  సౌలభ్యం, పెద్ద స్క్రీన్ సౌలభ్యం కోసం ఇంటర్నెట్ లేకుండా వైర్‌లెస్‌గా ల్యాప్‌టాప్‌ను మిర్రర్ చేసుకోవచ్చు. లేదా రిమోట్‌గా వారి కార్యాలయ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయవచ్చు. బహుళ లేయర్ల నాక్స్ ద్వారా భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కంపెనీ చెబుతోంది.

ధరలు

  • ఫ్రేమ్ 2020 టీవీ వరుసగా 50, 55, 65 అంగుళాల మూడు పరిమాణాల్లో ఫ్లిప్‌కార్ట్ లో లభ్యం. వీటి ధరలు  రూ. 74,990, రూ. 84,990, రూ.139,990. 
  • 10 సంవత్సరాల స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ. ప్యానెల్‌ పై ఒక సంవత్సరం అదనపు వారంటీ.
  • ఆన్‌లైన్ స్మార్ట్ టీవీ మోడళ్లు 32 అంగుళాల నుండి ప్రారంభమై 65-అంగుళాల వరకు ఉంటాయి. 4 కె యుహెచ్‌డి టివిలు 43,  50,  55,  65 అంగుళాల నాలుగు పరిమాణాలలో లభ్యం.  కొత్త ఎఫ్‌హెచ్‌డి, హెచ్‌డి రెడీ స్మార్ట్ టీవీలు 43, 32-అంగుళాలలో లభిస్తాయి.

శాంసంగ్ 4 కె యుహెచ్‌డి స్మార్ట్ టీవీ  (44) ధర రూ. 36,990 
65 అంగుళాల వెర్షన్‌ టీవీ రూ .89,990
ఎఫ్‌హెచ్‌డి, హెచ్‌డి రెడీ స్మార్ట్ టీవీ మోడళ్లు రూ.14,490 నుంచి ప్రారంభమవుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement