సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్‌టివీ సెగ్మెంట్‌లో దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా షావోమి, శాంసంగ్, ఎల్‌జీ సంస్థలు స్మార్ట్‌టీవలను వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజా ఈ కోవలోకి మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు షింకో చేరింది. ఎల్ఈడీ టీవీ ఎస్‌వో4ఏ పేరుతో కొత్త టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
39 ఇంచెస్ స్క్రీన్, 1366x768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యూఎస్‌బీ పోర్టులను ఈ టీవీలో పొందుపర్చింది. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను జోడించింది. దీని ధరను రూ.13,990 ధరగా కంపెనీ నిర్ణయించింది. షింకో ఎల్‌ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్) మధ్య వినియోగ దారులకు లభ‍్యమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment