new LED TV
-
తక్కువ ధరకే షింకో ఎల్ఈడీ టీవీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్‌టివీ సెగ్మెంట్లో దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా షావోమి, శాంసంగ్, ఎల్జీ సంస్థలు స్మార్ట్‌టీవలను వినియోగదారులకు సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజా ఈ కోవలోకి మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు షింకో చేరింది. ఎల్ఈడీ టీవీ ఎస్వో4ఏ పేరుతో కొత్త టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 39 ఇంచెస్ స్క్రీన్, 1366x768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను, రెండు హెచ్డీఎంఐ పోర్టులు ఉన్నాయి. అలాగే రెండు యూఎస్బీ పోర్టులను ఈ టీవీలో పొందుపర్చింది. 4కె వీడియో ప్లేబ్యాక్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే 20 వాట్ల సామర్థ్యం ఉన్న స్పీకర్లను జోడించింది. దీని ధరను రూ.13,990 ధరగా కంపెనీ నిర్ణయించింది. షింకో ఎల్‌ఈడీటీవీ ధరను రూ.6490 నుంచి ప్రారంభమై, రూ.60 వేల(65 ఇంచెస్) మధ్య వినియోగ దారులకు లభ్యమవుతున్నాయి. -
దీపావళి ఆఫర్‌తో ఇంటెక్స్ కొత్త టీవీ
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ హ్యాండ్సెట్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ కొత్త ఎల్ఈడి టీవీని లాంచ్ చేసింది. తన సరికొత్త 32 అంగుళాల ఎల్ఈడి టీవీని సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధరను రూ 16,490గా కంపెనీ ప్రకటించింది. 3222 మోడల్ ఎల్ఈడిటీవీలో అన్ డ్యూ ల్యాగ్ తొలగించి, అన్ని వైపుల నుంచి స్మార్టీ లుకింగ్ వ్యూని అందించే ఐ సేఫ్ టి-మ్యాట్రిక్స్ టెక్నాలజీ ని అమర్చారు. ఇప్పటికే వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన తాము తమ పోర్ట్‌ఫోలియోలో ఈ కొత్త శ్రేణి ఎల్ఈడి టీవీని జోడించడానికి సంతోషిస్తున్నామని , ఇంటెక్స్ డైరెక్టర్, బిజినెస్ హెడ్, నిధి మార్కండేయ ప్రకటించారు. అలాగు ఈ టీవీ కొనుగోలుపై దీపావళి ఆఫర్ గా వినియోగదారులు ఐదు సంవత్సరాల వారంటీ తో పాటు 8000ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు చెల్లుతుందని నిధి వెల్లడించారు.