Actress Swathi Sathish Gets Swollen Face After Root Canal Surgery - Sakshi
Sakshi News home page

Actress Swathi: సర్జరీ వికటించడంతో గుర్తుపట్టలేని స్థితిలో యువ నటి..

Published Sun, Jun 19 2022 6:58 PM | Last Updated on Mon, Jun 20 2022 8:31 AM

Actress Swathi Sathish Gets Swollen Face After Root Canal Surgery - Sakshi

సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్‌డమ్‌. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్‌ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్‌లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! 

కన్నడలో హీరోయిన్‌గా 'ఎఫ్‌ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ డెంటల్‌ హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు రూట్‌ కెనాల్‌ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్‌ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

చదవండి: చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్‌
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..

అయితే ఆ డెంటిస్ట్‌ తనకు తప్పుడు ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్‌ యాసిడ్‌ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌
డేటింగ్‌ సైట్‌లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement