Dental Hospital
-
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
శాశ్వత కట్టుడు పళ్ల చికిత్స
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సరిత దంత ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ట్రెఫాయిల్ ఇంప్లాంట్ పద్ధతిలో శాశ్వత స్థిరమైన కట్టుడు పళ్లను విజయవంతంగా అమర్చారు. శనివారం హోటల్ ఎన్‌కేఎం గ్రాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరిత ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి ముఖర్జీ ఈ చికిత్స వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నాగరాజకుమారి (54) గత మూడేళ్ల నుంచి దంతాల సమస్యతో బాధపడుతుంది. చికిత్స కోసం సైనిక్‌పురిలోని సరిత డెంటల్ క్లినిక్ వైద్యులను సంప్రదించింది. పరీక్షించిన వైద్యులు దంత వైద్య రంగంలో ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ట్రెఫాయిల్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో శాశ్వత, స్థిరమైన పళ్లను అమర్చాలని నిర్ణయించారు. ఈ చికిత్సలో అప్పటికే శిక్షణ పొందిన డాక్టర్ ఆకాష్ చక్రవర్తి, డాక్టర్ దేవ్‌జ్యోతి, డాక్టర్ పావని, డాక్టర్ సాయిప్రియల బృందం ఇటీవల ఆమెకు విజయవంతంగా చికిత్స చేశారు. భారతదేశంలో ఈ తరహా చికిత్సలు రెండు జరిగినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిదని డాక్టర్ ఆకాష్ చక్రవర్తి ప్రకటించారు. -
గ్రామాల్లో దంత వైద్య శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యాన్ని మారుమూల గ్రామాలకే కాదు, సామాన్య ప్రజల చెంతకూ తీసుకెళుతున్నామని చెప్పారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ హాస్పిటల్‌ను లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. వాహనం లోపలి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లా డారు. ‘మొబైల్ డెంటల్ హాస్పిటల్ వాహనాన్ని మారుమూల గ్రామాలకు పంపి దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. వాహనంలో ఏసీతో పాటు రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. దంత సమస్యలను పరీక్షించి, ఎక్స్ రే తీసి అవసరమైన చికిత్స అందించవచ్చు. ఇద్దరు వైద్యులు, సిబ్బంది, పరికరాలు, మందులు వాహనంలోనే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్ వాహనాలను, బైక్ అంబులెన్స్ లను, రెక్కల వాహనాలను, టీకా బండ్లను ప్రారంభించాం. వచ్చే బడ్జెట్లోనూ వైద్య శాఖకు మరిన్ని నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు’ అని చెప్పారు. -
కృత్రిమ దంతవైద్యంలో ఆధునిక పరిజ్ఞానం
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ దంతాల అమరికలో ఎప్పటికప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నట్టు పార్థా డెంటల్ ఆస్పత్రుల అధినేత డా.పార్థసారథి పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దంత వైద్యంపై ఇంకా ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లోని మణికొండలో నేడు పార్థ డెంటల్ క్లినిక్ 22వ బ్రాంచిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 బ్రాంచీలు ఉన్నాయని, నగరంలో 11 ఉన్నాయని, మణికొండ బ్రాంచి రాకతో సిటీలో ఆస్పత్రుల సంఖ్య 12కు చేరుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 22 అవుతాయని అన్నారు.