Goes Wrong
-
బరువు తగ్గించుకోవాలని ఆసుపత్రికెళితే ప్రాణమే పోయింది!
ఆరోగ్యంగా జీవించాలని ఆరాట పడిన యువకుడు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్ (26) బరువు తగ్గించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన వివాదం రేపింది. 150 కిలోల అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న హేమ చంద్రన్. బరువు తగ్గాలనే కోరికతో మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీ కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆపరేషన్ టేబుల్‌పై గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే మరో ఆస్పత్రికి తరలించి రెండు రోజులు ఐసీయూలో ఉంచారు. చివరికి మంగళవారం మృతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితు వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని హేమచంద్రన్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడు ఐటీ ఉద్యోగి అని, శస్త్రచికిత్స గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నాడని బాధితుడు తండ్రి దురై సెల్వనాథన్ తెలిపారు. తొలుత క్రోమ్‌పేట్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ గురించి ఆరా తీశాడు. ఆ తరువాత దాని గురించి మర్చిపోయాడు. కానీ ఆసుపత్రి నుండి పదే పదే కాల్స్ వస్తూ ఉండటంతో ఫిబ్రవరిలో వారిని మళ్లీ కలిసాడు. మొత్తం ఖర్చు 8 లక్షలు రూపాయలు చెల్లించలేనని చెప్పడంతో ఎస్కే జైన్ ఆస్పత్రిలో రూ.5 లక్షలకే చేస్తామని అసిస్టెంట్ చెప్పాడని సెల్వనాథన్ వెల్లడించారు. అయితే హేమచంద్రన్ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటంతో సర్జరీ వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 21న ఎస్కే జైన్ ఆసుపత్రిలో చేర్చామనీ, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు శస్త్రచికిత్స కోసం తీసుకెళ్లారని సెల్వనాథన్ చెప్పారు. 40 నిమిషాల తర్వాత, కొన్ని సమస్యలొచ్చాయని చెప్పి తన కుమారుడ్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని సెల్వ నాథన్ ఆవేదనకు గురయ్యారు.హేమచంద్రన్‌ను 48 గంటల పాటు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO)లో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆయన పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉందన్నారు. కానీ తానీ ఐసీయూలోకి వెళ్లేటప్పటికే తన కొడుకు నిర్జీవంగా ఉన్నాడని సెల్వనాథన్ పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లానని, అపుడు తన కొడుకు చనిపోయాడని ఆసుపత్రి అధికారులు ప్రకటించారన్నాడు. పోస్ట్‌మార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లారని సెల్వనాథన్ ఆరోపించాడు. గురువారం హేమచంద్ర అంత్యక్రియలు ముగిసాయంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.మరోవైపు హేమచంద్రన్ మృతి చెందినట్లు దీనిపై స్పందించిన తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. రెండు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. అతని కుటుంబం ఫిర్యాదు చేయనప్పటికీ, మీడియా నివేదికల ఆధారంగా ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారి తెలిపారు. -
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
‘సల్మాన్’ ఉసురు తీసిన టిక్-టాక్
జిమ్మిక్కుల సెలెంట్ కిల్లర్, మొబైల్ యాప్ టిక్-టాక్ వీడియోల వెర్రి యువత ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలోఈ వీడియోల మోజు వికటించి అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. దీనిపై ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణ స్నేహితుడి ఉసురు తీసిన వైనం కలకలం రేపింది. సల్మాన్, సొహైల్, అమీర్ ముగ్గురూ స్నేహితులు. ఆదివారం సాయంత్రం ముగ్గురు కారులో ఇండియా గేట్ వరకూ వెళ్లారు. అలా ఆ సాయంత్రం సరదాకి గడిపిన అనంతరం ముగ్గురూ తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంతలో టిక్-టాక్వీడియో తీసుకోవాలని కోరిక పుట్టింది సొహైల్‌కు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కారు డ్రైవ్ చేస్తున్న సల్మాన్ (19) పై గురిపెడుతూ.. టిక్-టాక్వీడియో తీయడానికి ప్రయత్నించాడు పక్క సీట్లో కూర్చున్న సొహైల్. కానీ దురదృష్టవశాత్తూ తుపాకి గుండు సల్మాన్ కుడి కణత భాగంలోకి చొచ్చుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్‌ను చూసి వెనక సీట్లో అమీర్ సహా, సొహైల్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేహితుడికి ఇంటికి వెళ్లి రక్తపు మరకల బట్టలను మార్చుకుని.. సల్మాన్‌ను సమీపంలోని ఎల్ఎన్జెపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఇంతలోనే సొహైల్, అతని స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఢిల్లీ బరఖాంబ రోడ్డుకు సమీపంలో ని రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందుకున్నపోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. సల్మాన్, అతని స్నేహితుడు షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హత్య, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. కాగా న్యూ జఫర్బాద్ ప్రాంతంలో నివసించే సల్మాన్ తండ్రి వ్యాపారవేత్త అని సల్మాన్ బంధువు తెలిపారు. అండర్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సల్మాన్ కుటుంబంలో చిన్నవాడు. అతనికి సోదరుడు, సోదరి ఉన్నారు. టిక్-టాక్ వీడియోల క్రేజ్‌లో మునిగి, వీడియోలను అప్లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
రైల్లో సాహసం ప్రాణం తీసింది..