
బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నం
ఆపరేషన్ బెడ్ మీదే గుండెపోటు
ఆరోగ్యంగా జీవించాలని ఆరాట పడిన యువకుడు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్ (26) బరువు తగ్గించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన వివాదం రేపింది.
150 కిలోల అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న హేమ చంద్రన్. బరువు తగ్గాలనే కోరికతో మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీ కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆపరేషన్ టేబుల్‌పై గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే మరో ఆస్పత్రికి తరలించి రెండు రోజులు ఐసీయూలో ఉంచారు. చివరికి మంగళవారం మృతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితు వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని హేమచంద్రన్ తండ్రి ఆరోపించారు.
తన కుమారుడు ఐటీ ఉద్యోగి అని, శస్త్రచికిత్స గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నాడని బాధితుడు తండ్రి దురై సెల్వనాథన్ తెలిపారు. తొలుత క్రోమ్‌పేట్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ గురించి ఆరా తీశాడు. ఆ తరువాత దాని గురించి మర్చిపోయాడు. కానీ ఆసుపత్రి నుండి పదే పదే కాల్స్ వస్తూ ఉండటంతో ఫిబ్రవరిలో వారిని మళ్లీ కలిసాడు. మొత్తం ఖర్చు 8 లక్షలు రూపాయలు చెల్లించలేనని చెప్పడంతో ఎస్‌కే జైన్ ఆస్పత్రిలో రూ.5 లక్షలకే చేస్తామని అసిస్టెంట్ చెప్పాడని సెల్వనాథన్ వెల్లడించారు.
అయితే హేమచంద్రన్ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటంతో సర్జరీ వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 21న ఎస్‌కే జైన్ ఆసుపత్రిలో చేర్చామనీ, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు శస్త్రచికిత్స కోసం తీసుకెళ్లారని సెల్వనాథన్ చెప్పారు. 40 నిమిషాల తర్వాత, కొన్ని సమస్యలొచ్చాయని చెప్పి తన కుమారుడ్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని సెల్వ నాథన్ ఆవేదనకు గురయ్యారు.
హేమచంద్రన్‌ను 48 గంటల పాటు ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO)లో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆయన పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉందన్నారు. కానీ తానీ ఐసీయూలోకి వెళ్లేటప్పటికే తన కొడుకు నిర్జీవంగా ఉన్నాడని సెల్వనాథన్ పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లానని, అపుడు తన కొడుకు చనిపోయాడని ఆసుపత్రి అధికారులు ప్రకటించారన్నాడు. పోస్ట్‌మార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లారని సెల్వనాథన్ ఆరోపించాడు. గురువారం హేమచంద్ర అంత్యక్రియలు ముగిసాయంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.
మరోవైపు హేమచంద్రన్ మృతి చెందినట్లు దీనిపై స్పందించిన తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. రెండు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. అతని కుటుంబం ఫిర్యాదు చేయనప్పటికీ, మీడియా నివేదికల ఆధారంగా ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment