Root Canal Treatment
-
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్
సినీ ప్రపంచం.. ఓ రంగుల లోకం. అందంగా ఉంటేనే అవకాశం. లేదంటే నిరుత్సాహం. ఆ అవకాశాలతోనే పేరు, డబ్బు, స్టార్డమ్. అలాంటి పేరు ప్రఖ్యాతలను ఎవరు కాదనుకోరు. అందుకోసం ఎలాంటి పనైనా చేయడానికి సాహసిస్తారు. గ్లామర్‌గా కనపడేందుకు ఎక్కడలేని పాట్లు పడతారు. సర్జరీలు చేయించుకుంటారు. సక్సెస్ అయితే ఓకే. వికటిస్తేనే భౌతికంగా ఎక్కడా లేని చిక్కులు. అయితే కొన్నిసార్లు అందం కోసం చేసే సర్జరీలే కాకుండా ఇతర ఆపరేషన్లు కూడా తేడా కొడతాయి. ఆ నటి అనుకుంది ఒకటైతే తనకు జరిగింది ఇంకొకటి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఆ నటి పరిస్థితి ఏంటో తెలుసుకుందామా ! కన్నడలో హీరోయిన్గా 'ఎఫ్ఐఆర్', '6 టు 6' వంటి తదితర చిత్రాల్లో నటించింది స్వాతి సతీష్ (Swathi Sathish). ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు రూట్ కెనాల్ థెరపీ (Root Canal Surgery) చేశారు వైద్యులు. తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది. ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. అయితే ఆ డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు తెలిపింది. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్‌పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు -
ప్రమాదంలో దంతాలు విరిగిపోయాయి...
నా వయసు 25 సంవత్సరాలు. ఇటీవల ఒక ప్రమాదంలో ముందు రెండు పళ్లు విరిగాయి. కొన్ని దంతాలు రంగుమారి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఒక పన్ను పూర్తిగా పోయింది. పాడైన దంతాల స్థానంలో కొత్త దంతాలను అమర్చవచ్చా? ఏ చికిత్స చేయించుకోవాలి? - పి. వసంత లక్ష్మి, తణుకు మీ దంతాలను సరిచేయడానికి, సాధారణమైన అసలైన దంతాల లాగే కనిపించేటట్లు చేయడానికి రకరకాల పద్ధతులున్నాయి. మీ సమస్యను సరిదిద్దడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ బాండింగ్ అనే రెండు రకాల కాంబినేషన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. డెంటల్ బాండింగ్ స్థానంలో క్యాప్, బ్రిడ్జి, ఇంప్లాంట్లలో ఏదో ఒక దానిని కూడా చేయవచ్చు. స్మైల్ మేకోవర్ లేదా స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇందులో దంతాల మధ్య ఖాళీలను డెంక్చర్, బ్రిడ్జి, ఇంప్లాంట్ పద్ధతుల్లో పూరిస్తారు. ఆ తర్వాత బ్లీచింగ్ ద్వారా దంతాలను తెల్లబరుస్తారు. విరిగిన దంతాలకు కాస్మెటిక్ ఫిల్లింగ్ ద్వారా పోర్సెలైన్ క్యాప్స్ లేదా పోర్సెలైన్ వెనీర్స్తో నింపుతారు. చిన్న చిన్న సందులను, ఎగుడుదిగుళ్లను, దంతాలు ఒకదాని మీద ఒకటి ఉండడాన్ని బ్రేసెస్ ద్వారా సరి చేస్తారు. చిగుళ్లకు చేసే గమ్మీ సర్జరీ కూడా స్మైల్ డిజైన్‌లో భాగమే. నల్లగా ఉన్న చిగుళ్లను ఈ చికిత్స ద్వారా ఆకర్షణీయంగా కనిపించేటట్టు చేస్తారు. ఈ విధానాలన్నీ స్మైల్ డిజైన్లోకి వస్తాయి. మీరు నిపుణులైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోండి. మునుపటిలా ఆనందంగా జీవించండి. - డాక్టర్ పార్థసారథి, దంతవైద్య నిపుణులు