
సాక్షి, బెంగళురు: చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడు. మంగళూరు సమీపంలో గడార్డి గ్రామ నివాసి శ్రీనివాస దేవాడిగ (60) గత నెల 26వ తేదీన అదృశ్యమయ్యాడు. దీనిపై అతని పిల్లలు బెళ్తంగడి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ అని ఫిర్యాదు చేశారు. ఈ నెల 3వ తేదీ సమీప గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం కుళ్లిపోయి కనబడింది. శ్రీనివాసదే అయి ఉండవచ్చునని నిర్ధారించి కుటుంబసభ్యులకు అప్పగించగా వారు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం ఉత్తరక్రియల్లో ఉండగా శ్రీనివాస నడుచుకుంటూ ఇంటికి చేరుకోవడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు సంభ్రమానికి లోనయ్యారు.
తాను చనిపోలేదని ఆయన చెప్పాడు. మద్యం అలవాటు ఉన్న శ్రీనివాస సోదరుని ఇంట్లో తలదాచుకున్నట్లు చెప్పాడు. కాగా, చెరువులో లభించిన మృతదేహం ఎవరిదనేది పోలీసులకు సవాల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment